Begin typing your search above and press return to search.

ఊరిపి బ‌లం పెర‌గాలంటే మ‌లైక యోగం

By:  Tupaki Desk   |   5 May 2021 5:32 AM GMT
ఊరిపి బ‌లం పెర‌గాలంటే మ‌లైక యోగం
X
కోవిడ్ -19 ముఖ్య లక్షణం కరోనావైరస్ బారిన పడిన వ్యక్తులలో ఊపిరి పీల్చుకోవడం స‌మ‌స్యాత్మ‌కంగా మారుతోంది. అయితే ఇలాంటి వారికి ఉప‌శ‌మ‌నం ఎలా? అంటే అందుకు కొన్ని యోగాస‌నాలు ఉన్నాయి. ప్ర‌ఖ్యాత బాలీవుడ్ క‌థానాయిక యోగా స్పెష‌లిస్ట్ మలైకా అరోరా ఈ మంగళవారం తన వ్యాయామ వీడియోలో యోగా అనులోమ్ విలోమ్ ప్రాణాయామను అభ్యసించడం ఎలా అన్న‌ది చెప్పారు. కరోనావైరస్ నేరుగా ఊపిరితో సంబంధం కలిగి ఉన్నందున మలైకా ఒక త్రోబాక్ ఫిట్ నెస్ వీడియోను పంచుకున్నారు.

ఇది యోగాలో ప్రత్యామ్నాయ నాసికా శ్వాస సాంకేతికత లేదా అనులోమ్ విలోమ్ ప్రాణాయామం ప్రాముఖ్యత గురించిన‌ది .. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.. అని తెలిపారు.

ప్రశాంతమైన వ్యాయామ దినచర్యను అభిమానుల కోసం షేర్ చేశారు. ``ఈ కఠినమైన సమయాల్లో మన దైనందిన జీవితంలో ఒక భాగమైన ప్రాణాయామాన్ని అనుస‌రించ‌డం చాలా ముఖ్యం. ఈ # మలైకాస్ మూవ్ ఆఫ్ వీక్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సులువైన మార్గం`` అని మ‌లైకా తెలిపారు. 6 రౌండ్ల అనులోమ్ విలోమ్ తో డేని ప్రారంభించండి. ఆహారం తీసుకునే ముందు తర్వాత కనీసం 2 గంటల విరామంతో క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. మీరు 21 రౌండ్ల వరకు వెళ్ళవచ్చు.. అని తెలిపారు.