Begin typing your search above and press return to search.
నిశ్చితార్థ అంగుళీకమా అది మలైకమా?
By: Tupaki Desk | 14 April 2021 3:30 PM GMTబాలీవుడ్ హాట్ గాళ్ మలైకా అరోరా ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. తాజాగా ఈ భామ తన అద్భుతమైన ఎంగేజ్ మెంట్ రింగ్ ని అభిమానుల కోసం ప్రదర్శించింది. ఇన్ స్టాలో తన వేలికి ఉన్న ఉంగరాన్ని ప్రదర్శిస్తూ కొంటెగా నవ్వేసింది. ఈ రింగ్ చూడగానే ఇది ప్రియుడు అర్జున్ కపూర్ ఇచ్చిన కానుకేనా? రింగ్ ఎప్పుడు తొడిగాడు? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఆ ఫోటోని ట్యాగ్ చేస్తూ.. వీరిద్దరిని అభినందించారు.
మలైకా అరోరా ఎంగేజ్ మెంట్ రింగ్ ధరించి పోజు ఇచ్చిన తర్వాత ఈ రూమర్ దావానలంలా వ్యాపించింది. అయితే ఇది కేవలం ఆభరణాల బ్రాండ్ కు పబ్లిసిటీ అని తెలిసి అంతా నిరాశపడ్డారు.
ఈ రింగ్ అమ్మాయిలు ఎంతగానో కలలు కనేది.. ప్రేమ ప్రేమ ప్రేమ ఆనందం ఇక్కడ మొదలవుతుంది !!! చెక్ అవుట్ @ornaz_com మీరు మీ జీవితకాల ప్రేమ కోసం కానుకివ్వాలనుకుంటే ఇది బ్రహ్మాండమైనది అంటూ బ్రాండ్ కి ప్రచారం చేసింది మలైకా. మీరు మీ రింగ్ ను కూడా ఇలా మార్చుకోవచ్చు. ఇది అద్భుతమైనదా కాదా? నా రింగ్ వివరాలను చూడటానికి ఇది స్వైప్ చేయండి!! అంటూ ప్రచారం ఊదరగొట్టేసింది మలైకా.
అయినా మలైకాని విడిచిపెట్టని అభిమానులు ప్రియుడు గురించి ప్రశ్నిస్తూ..``అర్జున్ కపూర్ .. ఆమెకు ఉంగరం కొనండి`` అని వ్యాఖ్యానించారు. మరొక అభిమాని ఈ జంట ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నారని అన్నారు. చాలామంది త్వరగా నిశ్చితార్థం కానిచ్చేసి పెళ్లాడేయొచ్చు కదా! అని అభిప్రాయపడ్డారు.
మలైకా- అర్జున్ కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ సంబంధాన్ని బహిరంగపరచాలనే వారి నిర్ణయం గురించి ఫిల్మ్ ఫేర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ ఏమన్నారంటే.. ``మీడియా మాకు గౌరవం ఇచ్చిందని మేము భావిస్తున్నందున మేం ప్రతిదీ ఓపెనయ్యాం. మీడియాకు ఒక నిర్దిష్ట అవగాహన ఉంది ... వారు దాని గురించి గౌరవప్రదంగా.. నిజాయితీగా మంచిగా ఉన్నారు. అందుకే నాకు సుఖంగా అనిపించింది. ఉద్దేశపూర్వకంగా రాయడం లేదా అడగడం ద్వారా మమ్మల్ని చికాకు పెట్టినప్పుడు ... అలాంటిదేమీ లేదు అని చెబుతాను`` అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
తాను వివాహం చేసుకోలేదని చెప్పాడు. ``నేను పెళ్లి చేసుకోలేదు. ఊహాగానాలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైంది. ఎందుకంటే నా సొంత ఇంట్లో ప్రజలు `తు షాదీ కబ్ కర్ రాహా హై అని అడుగుతారు? ఇది చాలా రొటీన్ ఇండియన్ ప్రశ్న. మీరు ఒకరితో మూడు రోజులు కూడా ఉంటే పెళ్లి ప్రశ్న తలెత్తుతుంది. 33 వయసు భారతదేశంలో చాలా మందికి పెళ్లి చేసుకోవడానికి గొప్ప వయస్సు. కానీ నాకు కాదు. నాకు ఇంకా సమయం ఉంది. నేను నా సంబంధాన్ని దాచకపోతే నా పెళ్లాడే సఖి గురించి దాచలేను కదా!`` అని అన్నారు.
ఓ ఇంటర్వ్యూలో మలైకాను వయస్సు వ్యత్యాసం సమస్య కాదా అని ప్రశ్నిస్తే.. ఆమె ఇలా చెప్పింది, ``మీరు సంబంధంలో ఉన్నప్పుడు వయస్సు వ్యత్యాసం నిజంగా పెద్దగా కనిపించదు. ఇది రెండు మనస్సులను హృదయాలను అనుసంధానించేది. దురదృష్టవశాత్తు మేము కాలంతో అభివృద్ధి చెందడానికి నిరాకరించే సమాజంలో జీవిస్తున్నాం. అమ్మాయిని అన్నిటా పొగిడేస్తారు. కానీ స్త్రీ పెద్దయ్యాక ఆమెను బుద్ధి లేనిదానా అని పిలుస్తారు. ఇలా ఆలోచించే వ్యక్తుల కోసం నా దగ్గర ఒక సమాధానం ఉంది. ఎగిరే ఎఫ్ * !! అని కట్ చేసింది మలైకా.