Begin typing your search above and press return to search.

డ‌బుల్ మాస్క్ తో మ‌లైకా మార్నింగ్ వాక్

By:  Tupaki Desk   |   14 May 2021 4:30 PM GMT
డ‌బుల్ మాస్క్ తో మ‌లైకా మార్నింగ్ వాక్
X
ఇంట్లో ఉంటేనే క్షేమం ఇపుడు. ఇల్లు దాటి బ‌య‌ట‌కు వ‌స్తే ప్ర‌మాదం పొంచి ఉంది. ఇలాంటి స‌మ‌యంలో మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ ల‌కు వెళితే త‌ప్ప‌ని స‌రిగా కోవిడ్ రూల్స్ పాటించాల్సిందే. బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా ఇప్పుడు వాటిని తూ.చ త‌ప్ప‌క ఆచ‌రిస్తోంది. ఇలా కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ శుక్ర‌వారంనాడు మార్నింగ్ వాక్ కి బ‌య‌ల్దేరారు. త‌న ప‌ప్సీ కాస్ప‌ర్ తో పాటు బాంద్రా వీధిలో అలా వాక్ చేశారు.

ఆ స‌మ‌యంలో మ‌లైకా డ‌బుల్ మాస్క్ ధ‌రించి క‌నిపించారు. సిమెంట్ రంగు స్కిన్ టైట్ ఫ్యాంటు స్పోర్ట్స్ టాప్ లో మ‌లైకా వేడిగా క‌నిపించింది. ఆ స‌మ‌యంలో పాద‌చారులు.. కాల‌నీ సెక్యూరిటీ వాళ్ల క‌ళ్ల‌న్నీ మ‌లైకా పైనే... భౌతిక దూరం పాటిస్తూ త‌న వాకింగ్ సెష‌న్స్ ని ఓ పార్క్ లో కానిచ్చేసిన మ‌లైకా.. లాక్ డౌన్ లో ఫిట్నెస్ పై పూర్తిగా దృష్టి సారించింది. సెల‌బ్రిటీలంతా ఇంట్లో వ్యాయామ శాల‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నా మ‌లైకా ఇలా ఆరు బ‌య‌ట‌కు రావ‌డం ఆస‌క్తిక‌రం.

ప్ర‌స్తుతం మ‌లైకా హాట్ జాగింగ్ ఫోటో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. నెటిజ‌నులు త‌మ‌దైన శైలి కామెంట్ల‌తో హీటెక్కిస్తున్నారు. ఇంత‌కుముందు ప‌వ‌న్ `గ‌బ్బ‌ర్ సింగ్` మూవీలో కెవ్వు కేక సాంగ్ కి డ్యాన్సులు చేసిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో వ‌రుస‌గా రియాలిటీ షోల‌తో బిజీగా ఉన్న మ‌లైకా ఇన్ స్టా వేదిక‌గా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని షేర్ చేస్తూ బాగానే ఆర్జిస్తోంది.