Begin typing your search above and press return to search.

మ‌లైకాని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు!

By:  Tupaki Desk   |   25 April 2021 4:31 AM GMT
మ‌లైకాని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు!
X
కొంద‌రు ఏం చేసినా బ్రాండ్ ని వ‌ద‌ల‌రు. కూచున్నా నించున్నా ప‌రుగుపెడుతున్నా.. తింటున్నా.. గాలి పీల్చుకున్నా.. ప్ర‌తిదీ బ్రాండెడ్ ఉండాల‌ని కోరుకుంటారు. అందుకే మారుతి లాంటి వాళ్లు బ్రాండ్ మీద‌ సినిమాలు తీసారు. బాలీవుడ్ టు టాలీవుడ్ క‌థానాయిక‌లంతా జిమ్ లకు వెళ్లినా.. యోగా సెష‌న్స్ కు వెళ్లినా.. బ్రాండెడ్ స్పోర్ట్స్ దుస్తుల‌కు చెప్పులు షూస్ కి ఇన్న‌ర్స్ కి ప్ర‌చారం చేస్తున్నారు.

హాట్ ఐటెమ్ గాళ్ మ‌లైకా అరోరా అందుకు అతీతం కాదు. ఈ భామ ఆరుబ‌య‌ట‌ ఎక్కడికి వెళ్లినా.. జిమ్ యోగా సెష‌న్స్ కి వెళ్లినా ఒక బ్రాండ్ ని మాత్రం అస్స‌లు విడిచిపెట్ట‌దు. అదే రీబాక్. కాళ్ల‌కు చెప్పులు.. ట్రాక్ సూట్లు.. ఇన్న‌ర్ లు.. ఏవి ధ‌రించినా క‌చ్ఛితంగా ఈ బ్రాండ్ ఉండాల్సిందే. అయితే మ‌లైకా కేవ‌లం రీబాక్ కి మాత్ర‌మే కాదు .. ఇంత‌కుముందు ర‌క‌ర‌కాల బ్రాండ్ల‌తో కాంట్రాక్టులు కుదుర్చుకుని ప్ర‌చారం సాగించారు. టీవీ క‌మ‌ర్షియ‌ల్స్ ఒకెత్తు అనుకుంటే సోష‌ల్ మీడియా ప‌బ్లిసిటీ కాంట్రాక్టులు ఇంకో ఎత్తు. అయితే ప్ర‌స్తుతం రీబాక్ స్పోర్ట్ బ్రాండ్ తో బిగ్ డీల్ కుదుర్చుకున్న మ‌లైకా ఈ బ్రాండ్ ని విరివిగా ధ‌రిస్తూ ప‌బ్లిక్ లోకి వ‌స్తూ ప్ర‌తిచోటా ప్ర‌చారం చేస్తోంది.

ఆరుబ‌య‌ట‌కు వెళితే చాలు ఈ భామ కోసం కెమెరా క‌ళ్లు కాపు కాసుకుని వేచి ఊతున్నాయి. అందుకే కార్పొరెట్ బ్రాండ్లు త‌న వెంట‌ క్యూ క‌డుతున్నాయి. ఓవైపు క‌రోనా క‌ల్లోలంతో స్టార్లంతా సినిమా షూటింగుల్లేక ఖాళీగా ఉంటే మ‌లైకా మాత్రం ఇలా బ్రాండ్ల‌కు క్యాంపెయినింగ్ చేస్తూ భారీగా ఆర్జిస్తోంది. బుల్లితెర వెండితెర షూటింగుల‌కు గ‌డ్డుకాలం దాపురించినా మ‌లైకా ఆదాయం ప‌డిపోకుండా ఉండ‌డానికి కార‌ణ‌మిదేన‌ని భావిస్తున్నారు.

చాలా కాలంగా వేడెక్కించే స్పోర్ట్స్ బ్రాండ్స్ తో ఆరుబ‌య‌ట తిరిగేస్తుంటే చాలామంది ఇదేం చోద్యం అనుకున్నారు. కానీ ఆ ఒంపు సొంపుల వ‌య్యారాల వ‌డ్డ‌న‌ల వెన‌క కోట్లాది రూపాయ‌ల బిజినెస్ ఉంద‌ని తెలిశాక‌ ముక్కున వేలేసుకుంటున్నారు.