Begin typing your search above and press return to search.

నైట్ పార్టీలు మామూలే! ప‌గ‌టి భంగిమ‌లు ష‌రా మామూలే!!

By:  Tupaki Desk   |   26 March 2021 8:58 AM GMT
నైట్ పార్టీలు మామూలే! ప‌గ‌టి భంగిమ‌లు ష‌రా మామూలే!!
X
మ‌లైకా అరోరా రెగ్యుల‌ర్ ఫిట్నెస్ త‌ర‌గ‌తుల గురించి తెలిసిందే. ముంబైలో ప్ర‌ముఖ యోగా స్టూడియోతో టైఅప్ పెట్టుకున్న‌ మలైకా ఏడాది పాటు ఉచిత ఆన్ లైన్ యోగా శిక్ష‌ణా త‌ర‌గ‌తుల్ని నిర్వ‌హిస్తున్నారు. దీనికోసం అధికారిక‌ వెబ్ లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సిందిగా ఇంత‌కుముందు కోరారు. దానికి జ‌నం నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

ప్ర‌తి సోమ‌వారం ఏదో ఒక స్పెష‌ల్ యోగా భంగిమ‌ను అభిమానుల‌కు నేర్పిస్తోంది మ‌లైకా. తాజాగా ఓ ప్ర‌త్యేక‌మైన‌ వ‌ర్క‌వుట్ సెష‌న్ కి సంబంధించిన వీడియోని ఫోటోల్ని మ‌లైకా షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. మలైకా అరోరా పార్టీ డిటాక్స్ తరువాత ఇలా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. మలైకా లుక్ చూశాక‌.. అమేజింగ్ సెషన్! హ‌ల్ చ‌ల్ చేయండి! అంటూ తోటి ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ వ్యాఖ్యానించారు.

మలైకా అరోరా ప్రతిరోజూ జిమ్ లేదా యోగా స్టూడియోలో గంట‌ల కొద్దీ స‌మ‌యం గ‌డిపేస్తూ యోగ భంగిమ‌ల్లో ఇన్నోవేష‌న్ కి సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ఏదైనా రాత్రి విందు పార్టీ అయినా కానీ.. మ‌రునాటి ఉదయం యోగాని విడిచిపెట్ట‌రు. స్కిప్ కొట్ట‌డం అన్న‌దే జ‌ర‌గ‌దు. నైట్ పార్టీ ముగిసినా కానీ.. గురువారం సాయంత్రం మలైకా వర్కౌట్ స్టూడియోలో తన హాజరును ధృవీక‌రించారు. బ్యాలెన్సింగ్ వ్యాయామాలు చేస్తున్న కొన్ని ఫోటోలను కూడా మ‌లైకా షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి.

బుధవారం సాయంత్రం మలైకా అరోరా తన సోదరి అమృత అరోరా తన ఇంట్లో నిర్వహించిన పార్టీలో తన స్నేహితులతో ఫుల్ గా చిలౌట్ చేశారు. పార్టీకి ప్రియుడు అర్జున్ కపూర్ తో పాటు కరిష్మా కపూర్- కరణ్ జోహార్- గౌరీ ఖాన్- మనీష్ మల్హోత్రా- మహీప్ - సంజయ్ కపూర్- సీమా ఖాన్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

తాజా యోగా భంగిమ‌ల్ని చూశాక‌..నైట్ పార్టీలు మామూలే! ప‌గ‌టి భంగిమ‌లు ష‌రా మామూలే!! అంటూ అభిమానులు మ‌లైకాపై పంచ్ లు వేస్తున్నారు. వాటిపై నెటిజ‌నుల్లో డిస్క‌ష‌న్ అంతే వేడెక్కిస్తోంది.