Begin typing your search above and press return to search.

పొట్ట దిగువ‌ స్ట్రెచెస్.. దొరికిపోయాక మ‌లైకా ఇలా జాగ్ర‌త్త‌..!

By:  Tupaki Desk   |   26 Jan 2021 9:30 AM GMT
పొట్ట దిగువ‌ స్ట్రెచెస్.. దొరికిపోయాక మ‌లైకా ఇలా జాగ్ర‌త్త‌..!
X
ఫిట్నెస్ ఫ్రీక్ మ‌లైకా అరోరా ఒంపు సొంపులు రూప‌లావ‌ణ్యం గురించి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా మాట్లాడుకుంటారు. 50 వ‌య‌సుకు చేరువైనా ఇంకా టీనేజీ మిస‌మిస‌ల‌తో మ‌లైకా ఇచ్చే ట్రీట్ ని ఎవ‌రూ మ‌రువ‌లేరు. ఇక జిమ్ యోగా డ్రెస్సుల్లో టైట్ ఫిట్స్ తో కనిపించి యూత్ గుండెల్లో మంట‌లు పెట్టడం ఈ అమ్మ‌డికి రెగ్యుల‌ర్ హ్యాబిట్.

కానీ ఉన్న‌ట్టుండి మ‌లైకా ఒక రాంగ్ రీజ‌న్ తో కెమెరా కంటి‌కి చిక్కింది. ఆ ఫోటోలో త‌న న‌డుము చుట్టూ స్ట్రెచెస్ ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ఇన్నాళ్లు బాగానే క‌వ‌ర్ చేసింది. ఎంత దాచాల‌న్నా దాచ‌నిది వ‌య‌సు.. ఇప్పుడు దొరికిపోయిందిగా!! అంటూ కొంద‌రు కామెంట్లు చేశారు.

మలైకా అరోరా ఈ ఫోటోలో `ఓల్డ్ ఉమెన్`లా క‌నిపించేస‌రికి `ఓవర్ విజిబుల్ స్ట్రెచ్ మార్క్స్` అన్న కామెంట్లు ప‌దే ప‌దే పోస్ట్ చేశారు నెటిజ‌నం. అయితే కొంద‌రు నెటిజనులు త‌న‌ను సమర్థించిన వారు లేక‌పోలేదు.

స్ట్రెచ్ మార్కులు గర్భం ధరించిన త‌రవాత ఆడ‌వారికి చాలా సహజం. బరువులో ఆకస్మిక మార్పు క‌నిపిస్తుంది. ఇటీవల తన సోషల్ మీడియా పోస్ట్‌లతో ఫి‌నెస్ లక్ష్యాలను నిర్దేశించుకున్న మలైకా అరోరాను ముంబైలోని ఫోటోగ్రాఫర్ లు ఇలా బుక్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో క‌నిపించ‌డంతో చాలా మంది నెటిజన్లు స్ట్రెచ్ మార్కుల ను చూపిస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇది సహజమైన విషయం అని చాలామంది ఆమెకు మద్దతుగా వచ్చారు. ఆమె పొత్తికడుపు కు దిగువ‌గా యోగా ప్యాంటు ధరించింది.

ఏదేమైనా త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల్ని తిప్పి కొట్టాల‌ని నిర్ణ‌యించుకుని యోగాభ్యాసాన్ని మ‌రింత సీరియ‌స్ గా చేస్తున్న ఫోటోల్ని మ‌లైకా తాజాగా షేర్ చేసారు. ఈసారి సేతు బంధ‌నాస‌నాన్ని ప‌రిచ‌యం చేసారు. వెల్ల‌కిలా ప‌డుకుని విల్లులాగా న‌డుమును పైకి లేపాలి. చూసేందుకు ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జీలా క‌నిపిస్తారు. దీనిని ఎంతో ఒడుపుగా చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది మ‌లైకా.