Begin typing your search above and press return to search.
అందుకే విడాకులు తీసుకున్నా అంటున్న హీరోయిన్
By: Tupaki Desk | 3 April 2020 10:50 AM GMTమలైకా అరోరా. బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో గ్లామర్ పాత్రలతో - మూవీస్ తో - పాటలతో కొంతకాలం ఊపు ఊపేసింది. పెళ్లి తర్వాత కూడా ఎన్నో పాటలలో సినిమాలలో కన్పించి అభిమానులను అలరించింది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్న మలైకా తన విడాకుల గురించి, ప్రస్తుత వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు వెల్లడించింది. 2017లో భర్త అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకునే సమయంలో మలైకా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని చెప్తుంది. ఇటీవల కరీనా కపూర్ టాక్ షోకు అతిథిగా వచ్చిన మలైకా తన విడాకుల గురించి స్పందిస్తూ.. ‘నన్ను విడాకులు తీసుకోకూడదని చాలామంది హెచ్చరించారు. విడాకులు తీసుకోవాలనే నీ ఆలోచనకు కూడా ఎవరు మద్దతుగా నిలబడం అనేవారు. విడాకులు తీసుకునే ముందు రోజు కూడా నా కుటుంబ సభ్యులు ‘నిజంగానే డివోర్స్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యావా?’ అని అడిగినట్లు తెలిపింది.
జీవితంలో కొన్ని నిర్ణయాలు జీవన విధానాన్ని కష్టంగా మార్చేస్తాయి. ఆ నిర్ణయాలు అపనిందలు కూడా తీసుకొస్తుంది. అయితే బాగా అలోచించి సరైనదని భావించే నేను, అర్భాజ్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని చెప్పింది. అలాగే మరి కొడుకు అర్హాన్ ఎలా ఒప్పుకున్నాడు అంటే.. ‘‘ఏ తల్లి అయినా పిల్లలకు ఆనందాన్ని పంచాలని కోరుకుంటుంది. పరిస్థితుల ప్రభావం వల్ల అర్హాన్ కూడా మలైకను సమర్థించాడట. ఓ రోజు అర్హాన్ వచ్చి.. అమ్మ నువ్వు అనందంగా ఉండటానికి ఏం చేయాలనీ అనుకుంటున్నావో అదే చేయి అన్నాడట. ఎందుకంటే నేను నిన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నాను’’ అని చెప్పాడని గుర్తు చేసుకుంది. కానీ వైవివాహిక బంధంలో అభిప్రాయ భేధాలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకుని గతేడాది అధికారికంగా విడాకులు తీసుకున్నారు. 2017లో ఈ వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయినట్లు అధికారంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మలైకా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో - అర్భాజ్ ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానీతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలిపారు.