Begin typing your search above and press return to search.

పెళ్లి గురించి అడిగితే సిగ్గేంటో!

By:  Tupaki Desk   |   13 Nov 2018 5:28 AM GMT
పెళ్లి గురించి అడిగితే సిగ్గేంటో!
X
ప్ర‌స్తుతం కెవ్వు కేక బ్యూటీ మ‌లైకా అరోరాఖాన్ ఎఫైర్ బాలీవుడ్ ని హీటెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కంటే 15ఏళ్ల చిన్న వాడైన అర్జున్ క‌పూర్‌ తో ఈ అమ్మ‌డు జోరుగా ప్రేమాయ‌ణం సాగించ‌డంపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. జంట‌గా తిరిగేస్తున్నారు.. వ‌చ్చే ఏడాది పెళ్లి! అంటూ బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు జోరెక్కిపోతున్నాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. 2019 ఏప్రిల్‌ లో ఈ జంట ఒక‌టి కానున్నార‌న్న ప్ర‌చారంతో దేశ‌వ్యాప్తంగా ఈ హాట్ క‌పుల్ ఎఫైర్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆ ఇద్ద‌రూ ప్ర‌తి ఈవెంట్‌కి క‌లిసే వెళుతున్నారు. ఇదివ‌ర‌కూ మిల‌న్‌ లో మలైక బ‌ర్త్‌ డే ఈవెంట్‌ కి స‌ర్‌ ప్రైజ్ గెస్ట్ గా ఎటెండ్ అయ్యాడు అర్జున్. ఆ త‌ర్వాత క‌ర‌ణ్ జోహార్ పార్టీకి - ముంబైలో ర‌క‌ర‌కాల చోట్ల జ‌రిగిన ప‌లు ఈవెంట్ల‌కు జంట‌గా ఒకే కార్‌ లో క‌లిసి వెళ్లారు ఆ ఇద్ద‌రూ. మ‌లైకా ఓసారి అర్జున్ క‌పూర్ ఇంట్లోనే ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో ఇక స్పెక్యూలేష‌న్స్ పీక్స్‌ కి చేరుకున్నాయి. ఇక పెళ్లి ఒక్క‌టే పెండింగ్ అంటూ ముంబై మీడియా నానా ర‌చ్చ చేస్తోంది.

అయితే దీనిపై మాట్లాడేందుకు అర్జున్ కానీ - మ‌లైకా కానీ అస్స‌లు ఇష్ట‌ప‌డ‌డం లేదు. మ‌లైకా ఎట్ట‌కేల‌కు దీనిపై ముభావంగానే స్పందించింది. మ‌లైకా మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం సంతోషంగా ఉన్నాను.. న‌న్ను ఇలానే ఉండ‌నివ్వండి అంటూ గుంభ‌న‌గా మాట్లాడింది. జీవితం అంద‌మైన‌ది.. విలువైన‌ది! లాంటి బ‌రువైన ప‌దాల‌తో గ‌మ్మ‌త్తైన మాట‌కారిత‌నం ప్ర‌ద‌ర్శించింది. వ్య‌క్తిగ‌త జీవితంపై ప్ర‌శ్న‌ల‌కు నేనెప్పుడూ స‌మాధానం ఇవ్వ‌లేను. ఇలాంటి వాటిని మాట్లాడాలంటే నాకు సిగ్గేస్తోంది. అసౌక‌ర్యంగానూ అనిపిస్తుంది. నా జీవితం ఏంటో నేను చెప్పాల్సిన అవ‌స‌రం లేకుండా అంద‌రికి తెలుసు క‌దా! అంటూ కూనిరాగాలు తీసింది. మొత్తానికి ఈ హాటీ నాటీగా చెప్ప‌క‌నే చెప్పేసింది త‌న ఎఫైర్ గురించి. కుర్ర‌హీరో అర్జున్ క‌పూర్‌ తో త‌న సాన్నిహిత్యం ఎంతో బావుంద‌ని ఒప్పుకుంది ఈ భామ‌.