Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: యోగా ..ఇంత వేడిగానా?

By:  Tupaki Desk   |   2 Feb 2019 4:52 AM GMT
ఫోటో స్టోరి: యోగా ..ఇంత వేడిగానా?
X
బాలీవుడ్ ఐటెమ్ గాళ్ మ‌లైకా అరోరాఖాన్ యువ‌హీరో అర్జున్ క‌పూర్ మ‌ధ్య ఘాటైన ఎఫైర్ గురించి యూత్‌లో నిరంతరం వేడెక్కించే చ‌ర్చ సాగుతోంది. ఈ జంట తొంద‌ర్లోనే పెళ్లికి రెడీ అవుతున్నార‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. దీనిపై మలైకా కానీ, అర్జున్ క‌పూర్ కానీ స‌రైన ఆన్స‌ర్ ఇవ్వ‌లేదు. త‌మ వ్య‌క్తిగ‌త జీవితాల గురించి ప్ర‌శ్నించాల్సిన ప‌నేలేద‌ని మీడియాకు ప‌దే ప‌దే చెబుతూనే ఉన్నారు.

అదంతా అటుంచితే 40 ప్ల‌స్ వ‌య‌సులోనూ మ‌లైకా టీనేజీ మిస‌మిస‌ల‌పై బోయ్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. త‌న‌కంటే వ‌య‌సులో ఎంతో చిన్న వాడైన అర్జున్ క‌పూర్ ని బుట్ట‌లో వేసేంత‌గా మ‌లైకా త‌న రూపాన్ని మార్చేసుకుంది. అందుకోసం ఈ అమ్మ‌డు ఏ రేంజులో శ్ర‌మిస్తోందో చూస్తేనే షాకిస్తోంది అంటూ మాటా మంతీ సాగుతోంది. మ‌లైకా నిరంత‌రం జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తుంది. అలాగే యోగ‌, ధ్యానం విష‌యంలో క‌ఠోరంగా నియ‌మాలు పాటిస్తుంది. అందుకే త‌న దేహ‌శిరుల్ని ఆ రేంజులో మెయింటెయిన్ చేయ‌గ‌లుగుతోంద‌న్న‌ది ఓ విశ్లేష‌ణ‌.

ఈ లేటు వ‌య‌సు ఘాటు భామ రెగ్యుల‌ర్ గా యోగ సాధ‌న చేస్తూ ఆ రూపాన్ని కాపాడుకుంటుంది. తాజాగా యోగ ప్రాక్టీస్ చేస్తూ ఇదిగో ఇలా ప్ర‌త్య‌క్ష‌మైంది. బ్యాలెన్స్ యోగ‌! అంటూ యోగ కోచ్ సాయంతో కొత్త‌గా ప్ర‌యోగాలు చేస్తోంది. ఇలా యోగ చేయ‌డ‌మే కాదు.. అవ‌స‌రం మేర ఆహార నియ‌మాల్ని పాటిస్తాన‌ని మ‌లైకా చెబుతోంది. స‌మ‌యం దాటాక తిండి తిన‌ను. సాయంత్రాలు 7.30 త‌ర్వాత అస్స‌లు ఆహారం జోలికి వెళ్ల‌న‌ని మ‌లైకా క్లియ‌ర్ క‌ట్ గా చెప్పేసింది. తినే ప‌దార్థాల్లో నూనెల శాతం సున్నా.. అవ‌స‌రం మేర నెయ్యిని మాత్ర‌మే ఉప‌యోగిస్తాన‌ని తెలిపింది. ఇంకా ఈ లేటు వ‌య‌సు నాటీ త‌న‌ అందానికి సంబంధించిన ర‌హ‌స్యాలు లీక్ చేస్తుందేమో చూడాలి.