Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఏజ్ బారవని ఏంజెల్

By:  Tupaki Desk   |   22 Jan 2018 9:56 AM GMT
ఫోటో స్టోరి: ఏజ్ బారవని ఏంజెల్
X
యంగేజ్ నుంచి మిడిల్ ఏజ్ కు వస్తే గ్లామర్ తగ్గుతుంది. వయసుతో పాటు సొగసు మాయమైపోతుంది. ఇది అందరు సుందరాంగులకు ఉండే బాధే. కొంతమందిని మాత్రం దీనికి మినహాయింపుగా చెప్పుకోవచ్చు. ఎంత వయసు పెరిగినా వారి బ్యూటీలోని హాట్ నెస్ ఏ మాత్రం తగ్గదు. బాలీవుడ్ ఐటం గర్ల్ మలైకా అరోరాను చూస్తే ఈ మాట కచ్చితంగా ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. నలభైల్లోనూ నలుసంతైనా తగ్గని ఆమె వయ్యారాన్ని చూసి కెవ్వు కేక అనాల్సిందే.

మలైకా అరోరా ఈ మధ్య బాలీవుడ్ సినిమాల్లో పెద్దగా కనిపంచలేదు. కానీ ఈ రోజుకూ ఆమె ఫొటో షూట్లు చేస్తూనే ఉంది. వాటికి విపరీతమైన పాపులారిటీ వస్తోంది లేటెస్ట్ గా మలైకా ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం చేసిన ఫొటో షూట్ తో అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు ఫాంలో ఉన్న బ్యూటీలకు ఏ మాత్రం తీసిపోకుండా హాట్ హాట్ గా ఆమె ఇచ్చిన ఫోజులను చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇంత లేటు వయసులో ఇంత గ్లామర్ మెయిన్ టెయిన్ చేయడమే కాదు.. దానిని స్పైసీగా చూపించడంలోనూ మలైకా మించిన వారెవరూ ఉండరంటూ కాంప్లిమెంట్ ఇచ్చేస్తున్నారు.

ఆమధ్య పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక సాంగ్ తో.. మహేష్ బాబు అతిథిలో రాత్రయినా నాకు ఓకే.. పగలైనా నాకోకే.. ఐటం సాంగులతో తెలుగు ప్రేక్షకులను మలైకా బాగానే కవ్వించింది. కెవ్వు కేక పెట్టేలా మలైకా ఇచ్చిన హాట్ ఫోజులను చూస్తే ఇప్పటికీ ఐటం సాంగులో దుమ్ము దులిపేయగలదని తెలిసిపోతుంది. మరి టాలీవుడ్ దర్శక.. నిర్మాతలదే ఆలస్యం.