Begin typing your search above and press return to search.

పొట్టి నిక్క‌రులో జిల్ జిల్ల‌నిపించిన మ‌లైకా

By:  Tupaki Desk   |   1 Dec 2020 3:02 PM GMT
పొట్టి నిక్క‌రులో జిల్ జిల్ల‌నిపించిన మ‌లైకా
X
ప‌బ్లిక్ లోకి వెళితే డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి? తెలిసింది త‌క్కువ‌మందికే. ప‌ర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్ తో క్లీన్ బౌల్డ్ చేయ‌డ‌మెలాగో తెలిసిన అతికొద్ది మంది అతివ‌ల్లో మ‌లైకా అరోరా పేరు టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఇదిగో ఇప్పుడిలా బోయ్స్ ని ప‌బ్లిక్ లోనే క్లీన్ బౌల్డ్ చేసి హాట్ టాపిక్ గా మారింది.

మలైకా అరోరా వైట్ అండ్ వైట్ రీబాక్ స్పోర్ట్ డ్రెస్ చిలౌట్ మూవ్ మెంట్ హాట్ టాపిక్ గా మారింది. రీబాక్ అథ్లెట్ ‌రైజర్ ‌లో తన ఫిట్ బాడీని ఎలివేట్ చేస్తూ చూప‌రుల‌కు చెమటలు పట్టించేస్తోంది. ఉదయం జిమ్ కి వ్యాయామానికి వెళుతూ ఇలా ప్ర‌త్య‌క్ష‌మైంది అరోరా. ఆమె టోన్డ్ ఫిజిక్‌కు విస్మయం చెంద‌ని వారే లేరు మ‌రి.

ఫిట్ ‌నెస్ ‌పై తనకున్న నిబద్ధతతో.. మలైకా తరచూ అభిమానులకు స్ఫూర్తినిస్తుంది. నిరంత‌ర‌ వ్యాయామంతో ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటెయిన్ చేయ‌డం త‌న‌కే చెల్లింది. ఆరోగ్యంగా ఉండటానికి ఉపాయాలు చిట్కాలను వివ‌రిస్తూ మలైకా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులను ప్రేరేపించేందుకు ముందుంటుంది.

ఇది మాత్రమే కాదు ఆమె తన ఫిట్నెస్ దినచర్యను ఎప్పుడూ దాటవేయదు. తరచుగా వ్యాయామశాలకు వెళుతుంది. ఈ రోజు వ్యాయామశాలకు వెళ్ళినప్పుడు క‌నిపించిందిలా. మంగళవారం ఉదయం త‌న ట్రైన‌ర్ యాస్మిన్ కరాచీవాలా వ్యాయామశాలకు వ్యాయామానికి వెళుతూ కెమెరాకి చిక్కింది.

ఇటీవల మలైకా తన ధర్మశాల ట్రిప్ నుండి అర్జున్ కపూర్ తో క‌లిసి ఉన్న ఫోటోల్ని ఇంత‌కుముందు షేర్ చేశారు. ఈ జంట ప్రేమ‌పూర్వ‌క కౌగిలింత రొమాన్స్ అంత‌ర్జాలాన్ని షేక్ చేసింది. కెరీర్ సంగ‌తి చూస్తే.. గత వారాంతంలో ముగిసిన భారతదేశపు ఉత్తమ డాన్సర్ ని ఎంపిక చేసే రియాలిటీ డ్యాన్స్ షోలో మలైకా న్యాయమూర్తిగా ఉన్నారు. ది ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ ఎపిసోడ్ లోనూ ఆమె కనిపించింది.