Begin typing your search above and press return to search.

ఖాన్ జంట మళ్ళి కలుస్తుందా?

By:  Tupaki Desk   |   22 Feb 2018 12:42 PM GMT
ఖాన్ జంట మళ్ళి కలుస్తుందా?
X
వ్యక్తిగతంగా తానొక నటుడైనా నిర్మాతగా ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నా సల్మాన్ ఖాన్ సోదరుడిగానే అందరికి పరిచయమున్న అర్బాజ్ ఖాన్ వైవాహిక జీవితం గత ఏడాది విడాకుల దాకా వచ్చింది. ఐటెం బాంబ్ గా బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా పేరున్న మలైకా అరోరా తన భార్య అన్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా గడిచిన వీళ్ళ కాపురం పిల్లలు యుక్త వయసుకు వచ్చాక విడిపోవాలన్న ఆలోచన కలిగింది.దానికి తోడు మలైకాకు ఒక యంగ్ కపూర్ హీరోతో ఎఫైర్ ఉందనే వార్త ప్రచారం కావడం, తానేమి తీసిపోనని అర్బాజ్ సైతం బయట అక్రమ సంబంధాలు సాగిస్తున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూయడం గత కొన్నేళ్ళుగా జరుగుతున్న తంతే.

తాజాగా ఇద్దరు మళ్ళి కలిసి ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్టు కొత్త న్యూస్ పుట్టించారు. దానికి బలం చేకూర్చేలా ఓ సంఘటన జరగడం అసలు ట్విస్ట్. నేహా ధూపియా హోస్ట్ గా ఉన్న ఒక షోకు అతిధులుగా మలైకా అరోరాతో సోదరి అమ్రితా అరోరా కూడా వచ్చింది. అందులో భాగంగా మలైకాను పిలిచే క్రమంలో అమ్రితా తన పూర్తి పేరుని మలైకా అరోరా ఖాన్ అంటూ వత్తి పలకడం చూస్తే ఇంకా ఇద్దరి మధ్య పూర్తి బ్రేకప్ కాలేదమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. తన సోషల్ మీడియా ఎకౌంటులలో మలైకా పేరులో ఖాన్ అనే పదాన్ని తీసేయకుండా అలాగే కంటిన్యూ చేస్తోంది.

అంటే మళ్ళి కలుస్తారు అనే వార్తలు నిజమే అనుకోవచ్చు. ఒకపక్క సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే మిగిలిపోతే ఇక్కడ అర్బాజ్ ఖాన్ పెళ్లి చేసుకుని కూడా కుదురుగా ఉండలేక విడిపోయే దాకా తెచ్చుకున్నాడు. దీనికి హ్యాపీ ఎండింగ్ పడాలని ఖాన్ ఫాన్స్ కోరిక. నాలుగేళ్ల క్రితం వచ్చిన పవన్ గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక పాటలో హుషారెత్తించిన భామ, ఈ మలైకా అరోరా ఒకటే అన్న సంగతి తెలిసిందే