Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: హాట్ జిమ్ పోస్టర్

By:  Tupaki Desk   |   22 Jun 2017 5:19 AM GMT
ఫోటో స్టోరి: హాట్ జిమ్ పోస్టర్
X
మలైకా అరోరా.. ఇండియా సినిమాలో హీరోయిన్ కాని హీరోయిన్ స్టేటస్ ఉన్న డాన్సర్. ‘చయ్యా చయ్యా’ తో రైలు ఎక్కి డాన్స్ చేసి బాలీవుడ్ సినిమాలలో టాప్ స్పెషల్ సాంగ్ డాన్సర్ గా గుర్తింపు పొందింది. మున్ని బద్నామ్ హుయి తో దేశం మొత్తం పాపులర్ అయ్యింది. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ లోకూడా కెవ్వు కేక అనిపించింది. ఇప్పుడు తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకొని వేరుగా ఉంటుంది.

నిన్న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రధాని నుండి స్కూల్ పిల్లలు వరకు అందరూ యోగాలో చేయడంలో బిజీ అయ్యారు. నరేంద్ర మోడి మాత్రమే కాదు.. యోగాను ప్రచారంలో భాగంగా వాడుకోవడంలో ఇంటర్నేషనల్ బ్రాండ్లు కూడా దూకుడు చూపిస్తున్నాయి. పేరున్న షూ కంపెనీ రీబాక్ ఇప్పుడు మాలైకా అరోరాతో యోగానాలు చేయించి వాళ్ళ బ్రాండ్ ప్రచారానికి కొత్త ఊపును తీసుకువచ్చారు. హాట్ భామ్ మాలైకాతో నా బలనికి నా ఫిట్నెస్ కు కారణం యోగానే అనే నినాధంతో కొన్ని పోస్టర్లు విడుదల చేశారు. మీ ప్రశాంత కు మీలోని ఒత్తిడి ని తగ్గించడం లోనూ యోగ బాగ ఉపయోగపడుతుంది అని చెబుతూ ఆసనాలు వేస్తున్న మలైకాను చూసి ఎంత మంది యెగా చేస్తారో చూడాలి.. లేకపోతే పోస్టర్ బాగుందిని జిమ్ లో పెట్టుకోవడానికి వాళ్ళ ట్రాక్ సూట్ ప్రచారం చేసుకోవడం వరకు వచ్చి ఆగిపోతుందో చూడాలి.

మోడల్ గా డాన్సర్ గా నటిగా టి‌వి హోస్ట్ గా రియాలిటీ షో జడ్జ్ గా బాగానే బిజీగా ఉన్న ఈ నర్తకీ ఇప్పుడు తన ఫ్యామిలి తో పూర్తిగా టైమ్ గడపడానికి ఇష్టపడుతోందిలే. విడాకులు తీసుకొని కూడా తన పిల్లలు పుట్టిన రోజునాడు మాజీ భర్తతో కలిసి స్నేహంగానే గడిపింది. ఇప్పుడు అయితే ఇలా యోగా చేసి బాడీ ఫిట్నెస్ చూపిస్తోంది. రచ్చః రచ్చస్య రచ్చోభ్యహా అంటే ఇదేనేమో!!