Begin typing your search above and press return to search.
తాను కాకుండా ఎవరు తీసినా అర్జున్ కు ఇష్టముండదు
By: Tupaki Desk | 11 May 2020 9:10 AM GMTబాలీవుడ్ హాట్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడేళ్ల క్రితం భర్త అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చిన మలైకా ఆ తర్వాత అర్జున్ కపూర్ తో ప్రేమ వ్యవహారంను బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం తో పాటు ఇద్దరు మీడియా ముందే కలిసి తిరుగుతున్నారు. వీరిద్దరు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడు అయినా కూడా అర్జున్ కపూర్ తో మలైకా ఎంతో ప్రేమను కనబర్చుతూ ఉంటుంది.
ఆమద్య కొన్ని ఇంటర్వ్యూల్లో అర్జున్ కపూర్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అర్జున్ కపూర్ తనను చేసే కేర్ నాకు నచ్చుతుందని చెప్పుకొచ్చింది. తనకు చెందిన ప్రతి విషయంను అర్జున్ గౌరవిస్తాడు ప్రేమిస్తాడని చెప్పింది. ఆమద్య లవర్స్ డే కు ఏకంగా ముద్దు పెట్టుకున్న ఫొటోలను షేర్ చేసి తమ ప్రేమను అధికారికంగా చెప్పేశారు. తాజాగా మరోసారి అర్జున్ కపూర్ గురించి మలైకా సోషల్ మీడియా లైవ్ లో మాట్లాడినది.
ఈ సందర్బంగా మలైకా మాట్లాడుతూ.. నా ఫొటోలను ఎవరు తీసినా కూడా అర్జున్ మెచ్చడు. నేను సెల్ఫీలు తీసుకున్నా కూడా అతడికి నచ్చవు. కేవలం నన్ను అతడు తీసిన ఫొటోలు మాత్రమే అతడికి ఇష్టం. నన్ను అతడే చాలా అందంగా ఫొటోలో బంధించగలను అని అభిప్రాయ పడుతాడు. అందుకే ప్రతి రోజు సాయంత్రం సమయంలో నాకు ఫొటోలు తీస్తానంటూ ఒత్తిడి చేస్తూ ఉంటాడు. నిజంగా కూడా అర్జున్ నన్ను చాలా అద్బుతంగా చిత్రీకరిస్తాడంటూ చెప్పుకొచ్చింది.
ఇంత ఆప్యాయంగా క్లోజ్ గా ఉంటున్న వీరిద్దరు పెళ్లి విషయంకు వచ్చేప్పటికి మౌనం వహిస్తున్నారు. మలైకా పెళ్లి విషయంలో ఆసక్తిగా ఉన్నట్లుగా లేదు. గతంలో తనకు పెళ్లి వల్ల సంతోషం లేకుండా పోయిందని అందుకే మళ్లీ పెళ్లి అంటేనే ఏదో ఆందోళనగా ఉంటుందని ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె మాటలు చూస్తుంటే ఇద్దరు పెళ్లి చేసుకోకుండా రిలేషన్ లో ఇలాగే కొనసాగుతారనిపిస్తుంది.