Begin typing your search above and press return to search.

అవన్నీ సిల్లీ రూమర్స్ అంటున్న మలైకా!

By:  Tupaki Desk   |   16 April 2019 11:39 PM IST
అవన్నీ సిల్లీ రూమర్స్ అంటున్న మలైకా!
X
బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ జంటలలో ఒకటి మలైకా అరోరా- అర్జున్ కపూర్ కపుల్. ఇద్దరికీ పదమూడేళ్ళు వయసు తేడా ఉన్నా అదేమీ పట్టించుకోకుండా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఉండడంతో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈమధ్య మలైకా-అర్జున్ జంట కొంచెం ముందుకెళ్ళి ఇరువైపులా కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఫోటోలు కూడా దిగుతూ ఉండడంతో వివాహం అతి త్వరలో ఉందని బాలీవుడ్ మీడియా తెగ చెవులు కోరుక్కుంటోంది.

ఇదిలా ఉంటే కొన్ని బాలీవుడ్ వెబ్ సైట్లు ఇంకా ముందుకు వెళ్ళి ఏప్రిల్ 19 న గోవా లో మలైకా-అర్జున్ ల వివాహం అని.. అందుకే రీసెంట్ గా సన్నిహితులకు బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చారని కథనాలు వండివార్చారు. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై మలైకాను ఇదే విషయం అడిగారు. "మీరు హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుంటున్నారా లేదా క్రైస్తవ సంప్రదాయంలోనా?" అని అడిగితే "ఈ సిల్లీ రూమర్లలో ఏమాత్రం నిజం లేదు" అంటూ తేల్చేసింది మలైకా.

కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మీ పెళ్ళి ఏ సంప్రదాయం ప్రకారం అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది కానీ అసలు అర్జున్ తో లవ్ లో ఉందా? ఇద్దరూ ఫ్యూచర్ లో పెళ్ళి చెసుకుంటారా.. కోరా? అనేవాటికి సమాధానాలు చెప్పలేదు. మరి ఆ ప్రశ్నలు కూడా అడిగేస్తే ఇండియాకు ఉన్న సమస్యలలో ఒక సమస్య పరిష్కారం అవుతుంది కదా!