Begin typing your search above and press return to search.

మహేష్ భార్యపై మహేష్ ఐటెం కామెంట్స్!

By:  Tupaki Desk   |   23 Feb 2018 8:22 AM GMT
మహేష్ భార్యపై మహేష్ ఐటెం కామెంట్స్!
X
మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్.. ఇప్పుడు స్క్రీన్ కు దూరమైపోయింది కానీ.. గతంలో ఆమె ఒక టాప్ మోడల్. అంతే కాదు.. ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్ కూడా. లేట్ నైంటీస్ లో ఈమె హవా బాగానే కనిపించింది. వివాదాలకు దూరంగా ఉండే ఈమెపై.. ఇప్పుడో భామ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు.. అతిథి చిత్రంలో మహేష్ బాబుతో కలిసి 'రాత్రయిన నాకు ఓకే' అంటూ ఆడి పాడిన మలైకా అరోరా.

ఈమె నమ్రతపై వ్యక్తిగతమైన కామెంట్స్ చేయలేదు కానీ.. ప్రొఫెషనల్ సైడ్ మాత్రం రివీల్ చేసింది. అప్పట్లో మలైకా అరోరాకు ఇండస్ట్రీ కొత్త. ఆ సమయానికే నమ్రతా శిరోద్కర్ టాప్ మోడల్. అలాంటి సమయంలో ఈమెపై సీనియర్ అయిన నమ్రత.. అథారిటీ చూపించేదట. మెహర్ జెస్సియా అనే మోడల్ తో కలిసి.. నమ్రత ఓ గ్యాంగ్ మాదిరిగా వ్యవహరించేవారట. ప్రస్తుతం ఈ మెహర్ జెస్సియా.. అర్జున్ రాంపాల్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. నేహాధూపియా నిర్వహించే వోగ్-బీఎఫ్ ఎఫ్ కార్యక్రమంలో ఈ విషయాలను చెప్పింది మలైకా అరోరా.

అయితే.. సడెన్ గా అలనాటి టాప్ మోడల్స్ గురించి రివీల్ చేసే సరికి సిట్యుయేషన్ సీరియస్ అయిపోయింది. కానీ తన కెరీర్ ప్రారంభంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా.. ప్రస్తుతం వీరిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ.. పరిస్థితిని తేలికపరిచే ప్రయత్నం చేసింది కెవ్వుకేక బ్యూటీ.