Begin typing your search above and press return to search.
కదిలిస్తున్న మలైకా పోస్టు
By: Tupaki Desk | 7 Jan 2017 9:29 AM GMTదేశంలో ఎక్కడ లైంగిక వేధింపుల ఘటనల గురించి గొడవ జరిగినా.. సంప్రదాయ వాదులు బయటికి వచ్చేసి అమ్మాయిలు పొట్టి దుస్తులు వేయడం వల్ల.. రాత్రి పూట బయట తిరగడం వల్ల.. మన సంస్కృతికి తగ్గట్లు నడుచుకోకపోవడం వల్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ ఒక వాదన వినిపిస్తారు. అమ్మాయిలే అబ్బాయిల్ని అఘాయిత్యాలకు పాల్పడేలా రెచ్చగొడుతున్నారని అంటారు. అమ్మాయిల రక్షణ అమ్మాయిలే చూసుకోవాలని సలహాలిస్తారు. ఇలాంటి వాదనలు వినిపించే వాళ్లకు సమాధానంగా బాలీవుడ్ భామ మలైకా అరోరా ఒక కదిలించే పోస్టు పెట్టింది. ఎవరో షేర్ చేసిన ఆ పోస్టును ఆమె షేర్ చేసింది. ఓ అమ్మాయి అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ ఆలోచన రేకెత్తించేలా ఉన్నా ఈ పోస్టేంటో చూద్దాం పదండి.
‘‘నేను ఓసారి నా స్నేహితురాళ్లతో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. అక్కడ చాలా మంది మగాళ్లు వచ్చి మమ్మల్ని లైంగికంగా వేధించారు. కానీ నా రక్షణ నా బాధ్యతే. మరోసారి నేను డిస్కోథెక్ కు వెళ్లాను. అక్కడున్న బౌన్సర్లు లోపలికి వచ్చి మమ్మల్ని కొట్టి మా దుస్తులు చించేశారు. కానీ నా రక్షణ నా బాధ్యతే. ఈసారి స్నేహితుడితో కలిసి సినిమాకి వెళ్లాను. అప్పుడు కొందరు వ్యక్తులు నన్ను ఓ బస్సులోకి లాక్కెళ్లి వికృతంగా ప్రవర్తించారు. కానీ నా రక్షణ నా బాధ్యతే. ఓరోజు పద్ధతిగా సల్వార్ కమీజ్ వేసుకుని కాలేజ్ కి వెళ్లాను. అక్కడ కొందరు వ్యక్తులు నన్ను మారుమూల ప్రదేశానికి తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నారు. కానీ నా రక్షణ నా బాధ్యతే. అందుకే ఇక నేను ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాను. అప్పుడు కొందరు ఇంటి తలుపు పగలగొట్టి లోపలికి వచ్చి నా చేతులు కట్టేసి నాపై అత్యాచారం చేసి వీడియో తీశారు. అయినా నా రక్షణ నా బాధ్యతే కదా. నా కుటుంబంతో ఉంటేనే నాకు రక్షణ అనుకుని ఇంటికి వెళ్లాను. ఇంట్లో వావి వరస చూడకుండా నావాళ్లే నన్ను లైంగికంగా వేధించారు. నా రక్షణ నా బాధ్యతే కాబట్టి నన్ను నేను బాత్రూమ్ లో బంధించుకున్నాను. ఐతే చుట్టుపక్కల మేడల మీది నుంచి ఎవరైనా బాత్రూం కిటికీలోకి చూస్తారేమో అని స్నానం చేయడం కూడా మానేశాను. ఇప్పుడు నేనెక్కడ ఉండాలని వాళ్లు కోరుకున్నారో అక్కడే ఉన్నాను. నా ఆత్మవిశ్వాసం ముక్కలైంది. ఎదురుతిరిగే సామర్థ్యం కోల్పోయాను. ఏదో సాధించాలన్న తపన నాశనమైంది. వాళ్ల కారణంగా నేను బాత్రూమ్ లోనే ఉండిపోవాల్సివచ్చింది. బయటికొస్తే నేను క్రీడల్లో రాణించగలను. దేశానికి పతకాలు సాధించగలను. ఆర్మీలో చేరగలను. కంపెనీకి సీఈవోను కాగలను. ప్రపంచాన్ని జయించగలను. ఐతే ఇవన్నీ నేను ఈ బాత్రూం నుంచి బయటికి వస్తేనే జరుగుతాయి. కానీ నా రక్షణ నా బాధ్యతే కదా. అందుకే అక్కడినుంచి రాలేను’’
ఇదీ మలైకా షేర్ చేసిన పోస్టు సారాంశం. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/