Begin typing your search above and press return to search.
'గబ్బర్ సింగ్' భామ రెండోసారి మహేష్ సరసన ఆడిపాడనుందా..?
By: Tupaki Desk | 22 Dec 2020 11:33 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేయనున్నాడు. ఈ సినిమాతో మహేష్ మరోసారి బాక్సాఫీస్ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడట. ఈ సినిమాను మైత్రి మూవీస్ తో పాటు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్.. 14రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. పరశురామ్ తో మహేష్ బాబు మొదటిసారి సినిమా చేస్తుండటంతో.. ఈ కాంబినేషన్ కొత్తగా ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాకు 'సర్కారు వారి పాట' అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మహేష్ అభిమానులు ట్విట్టర్ లో రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ దగ్గర నుండి మోషన్ పోస్టర్ వరకు ప్రేక్షకుల నుండి ఊహించని రేంజిలో స్పందన లభించింది. తాజాగా సర్కారు వారి పాటకు సంబంధించి ఒక వార్త సినీ వర్గాలలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే సర్కారు వారి పాట సినిమాలోని ప్రత్యేక పాటలో ఫేమస్ బాలీవుడ్ భామ మెరవనుందట. ఆ భామ ఎవరో కాదు.. ఇదివరకే అతిధి సినిమాలో మహేష్ తో ఆడిపాడిన మలైక ఆరోరా. సర్కారు వారి పాట మూవీలోని ఐటమ్ సాంగ్ తో.. మలైక రెండోసారి మహేష్ సరసన చిందెయ్యనుందని సమాచారం. మలైక ఇదివరకే గబ్బర్ సింగ్ సినిమాలోని కెవ్వుకేక పాటలో అలరించింది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.