Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి : ఒళ్లంత తుళ్లింత కావాలిలే!

By:  Tupaki Desk   |   31 May 2019 1:30 AM GMT
ఫోటో స్టోరి : ఒళ్లంత తుళ్లింత కావాలిలే!
X
ముంబై బాంద్రా ఏరియా కుర్ర‌కారు కంటికి కునుకు క‌రువైంది.ఉన్న‌ట్టుండి అంత విపత్తు ఏం వ‌చ్చింది? అంటారా? అందుకు కార‌ణ‌మేంటో ఇవిగో ఈ ఫోటోలు చూశాక మీరే చెబుతారు. అందుకేగా అంత‌గా 33 ప్రాయం హీరో అడిక్ట్ అయిపోయాడు పాపం! అని జాలిప‌డ‌కుండా ఉండ‌లేరు.

ఓవైపు మ‌లైకా అర్జున్ క‌పూర్ తో త‌న‌ ఎఫైర్ గురించి మీడియాలో మోతెక్కిపోతుంటే అవేవీ ప‌ట్టించుకోకుండా రొటీన్ గా త‌న ప‌నేదో తాను చేసుకుంటూ పోతోంది మ‌లైకా. ఎవ‌రిప‌ని వారిది. నా ప‌ని నాది! అన్న‌ట్టే ఉంది వాల‌కం. ఇదిగో ఇలా ముంబై బాంద్రాలోని ఓ జిమ్ నుంచి వ‌ర్క‌వుట్లు పూర్తి చేసి ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చి కారెక్కింది. ఆ గేటు తెరుచుకుని కారెక్కే లోపు ట‌పా ట‌పా కెమెరా ఫ్లాష్ లు మెరిశాయి. ఆ ఫ్లాష్ ల‌న్నీ మ‌లైకా అంగాంగాన్ని ఎంతో అందంగా చిత్రీక‌రించాయ‌ని ఈ ఫోటోలు చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఆ దేహశిరుల్ని హ‌త్తుకు పోయిన ఆ స్పోర్ట్స్ డ్రెస్ పుణ్య‌మా! అని కుర్ర‌కారు కంటిపై కునుకు క‌రువై ఎటో వెళ్లిపోతున్నారు. ఒళ్లంత తుళ్లింత కావాలిలే! గుండెల్లో జ‌ల్లంతా కుర‌వాలిలే!! అంటూ గీతాంజ‌లి గిరిజ‌లా ఏదో లోకంలో విహ‌రిస్తున్నారు.

టాప్ టు బాట‌మ్ బ్లాక్ జిమ్ వేర్ లో మ‌లైకం చంపేసిందంతే. చేతిలో ఎన‌ర్జీ డ్రింక్ .. దాంతో పాటే స్మార్ట్ ఫోన్.. క‌ళ్ల‌కు రెబాన్ గాగుల్స్ అబ్బో అదిరిపోయిందిలే. చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని స్టైల్ గా మ్యూజిక్ వింటూ అలా అలా మోడ్ర‌న్ రాక్ స్టార్ లా న‌డిచొచ్చింది. అన్న‌ట్టు 33 వ‌య‌సొచ్చేస్తోంది క‌దా? ఇక పెళ్లి చేసుకోవా? అని ప్రియుడు అర్జున్ క‌పూర్ ని ప్ర‌శ్నిస్తే.. నాకు ఇంకా అంత ఏజ్ రాలేదు! అంటూ న‌వ్వేశాడు మీడియా ముందు. మ‌రి ఇంత‌కీ మ‌లైకా వెర్ష‌న్ ఏంటో కానీ .. మీడియాకి మ‌రోసారి ఏదో ఒక సంద‌ర్భంలో చిక్కితే అంతే సంగ‌తి!!