Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: సాగర గర్భంలో సెక్సీ బ్యూటీ

By:  Tupaki Desk   |   27 April 2019 2:30 PM GMT
ఫోటో స్టొరీ: సాగర గర్భంలో సెక్సీ బ్యూటీ
X
బాలీవుడ్లో ఉన్న హాట్ బ్యూటీల లిస్టులో మలైకా పేరు ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. ఎందుకంటే 45 ఏళ్ళ వయసులో కూడా 25 వయసున్న హీరోయిన్లకు పోటీనిచ్చే ఫిట్నెస్.. హాట్ నెస్ ఆమె సొంతం. మలైకా కనుక ఒక ఫోటో షూట్ చేస్తే చాలు.. సోషల్ మీడియాలో సెగలు రేగుతాయి. కాకపోతే ఈమధ్య ఈ విషయాలు కాకుండా అర్జున్ కపూర్ తో ఎఫైర్ విషయంలో మలైకా పేరు ఎక్కువగా వార్తల్లో నానుతోంది.

అయితే వాటిని నేనేమీ పట్టించుకోను అన్నట్టుగా రెగ్యులర్ గా తన హాట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ నెటిజనులను థ్రిల్ చేస్తోంది. తాజాగా మరోసారి రెండు ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఇందులో సముద్రగర్భంలో డైవింగ్ చేస్తూ.. ఒక చేపలాగా పోజులిచ్చింది. ఈ ఫోటోలకు మలైకా ఇచ్చిన క్యాప్షన్ "శాంతం.. నిశ్శబ్దం.. ధ్యానం లాగా ఉంది." ఈ క్యాప్షన్ కు హిందూ మహాసముద్రం అని.. జలకన్య.. అని హ్యాష్ ట్యాగ్ లు జోడించింది. అర్థం అయింది కదా.. ఇండియన్ ఓషన్ మే.. స్లో మోషన్ మే ఈత కొడుతుంది హై. అది సరే కాని ఫోటోగ్రాఫర్ ఎవరు హై?

మనలాంటివారికి డౌట్ వచ్చినట్టే దర్శకురాలు ఫరా ఖాన్ కు డౌట్ రావడంతో ఆమె సూటిగా సుత్తిలేకుండా చిలిపిగా కన్నుకొట్టే ఎమోజిని పెట్టి మరీ అడిగేసింది. మలైకా దానికి సమాధానం చెప్పే లోపు నెటిజనులు ఒకరితో ఒకరు పోటీ పడి 'అర్జున్ కపూర్' అని చెప్పారు. అయినా మన పిచ్చి కానీ పెన్ ఎక్కడుంటే క్యాప్ అక్కడుంటుంది.. స్టవ్ ఎక్కడుంటే లైటర్ అక్కడే ఉంటుంది.. బ్యూటీ ఎక్కడుంటే ఆరాధకుడు అక్కడే ఉంటాడు. ఆయన అక్కడ.. మనం ఇక్కడ. ఇవేవీ తెలియని వాళ్ళు ఇంకో చోట!