Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: లాక్మే ఈవెంట్ లో మలైకం

By:  Tupaki Desk   |   26 Aug 2019 12:48 PM GMT
ఫోటో స్టొరీ: లాక్మే ఈవెంట్ లో మలైకం
X
బాలీవుడ్లో ఎంతో మంది హాటు బ్యూటీలు ఉన్నారు కానీ లేటు వయసు హాటు బ్యూటీల్లో ఫస్ట్ ప్లేస్ మాత్రం మలైకా ఆరోరాకే. 46 ఏళ్ళ వయసులో స్లిమ్ముగా.. ఫిట్టుగా తీరైన ఒంపుసొంపులతో కనిపించడం.. బికినీ వేస్తే అదరహో అనిపించడం సాధారణమైన విషయం కాదుగా? టీనేజ్ వయసు కుమారుడు ఉన్న మలైకా ఇలా బికినీలో కనిపించడం చాలామందికి నచ్చదేమో కానీ మలైకా ఫిట్నెస్ కు మాత్రం ఎవరైనా సలాం కొట్టాల్సిందే.

మలైకా రీసెంట్ గా ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. ఓ ఫ్యాషనబుల్ డ్రెస్ ధరించి ర్యాంప్ వాక్ చేసింది. బాలీవుడ్ భామలు ఎవరు ర్యాంప్ వాక్ చేసినా అందంగా ఉంటుంది కానీ ఈ ఛయ్య ఛయ్య భామ స్టైలే వేరు. తన స్టైల్ తో.. హాట్ అప్పీల్ తో ర్యాంప్ ను రఫ్ఫాడించింది. డార్క్ బ్రౌన్ కలర్ అవుట్ ఫిట్ లో జనాలను మెస్మరైజ్ చేసింది. డీప్ వీ నెక్ తో పాటు సీతాకోకచిలుక రెక్కల్లా ఉండే స్లీవ్స్. థై స్లిట్ ఉండే పొడవాటి లెహెంగా ధరించి హొయలుపోతూ నడించింది. ఒత్తుగా దువ్విన జుత్తు.. చాకొలేట్ కలర్ లిప్ స్టిక్.. పర్ఫెక్ట్ మేకప్ తో ఈ జెనరేషన్ హీరోయిన్లందరికీ గ్లామర్ సవాలు విసిరింది. ఈ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.

ఈ ఫోటోలకు జనాలు లైకులు మీద లైకులు కొట్టారు. ఇక కామెంట్లు కూడా బోలెడు వచ్చాయి. "బ్యూటిఫుల్ డెవిల్".. "హాటెస్ట్ ఆంటీ నంబర్ 1".. "లాక్మే ని ఉతికి ఆరేశావుగా" అంటూ పొగడ్తలు కురిపించారు.