Begin typing your search above and press return to search.
అవమాన భారంతో ఈవెంట్ వదిలి రుసరుసా వెళ్లిందట!
By: Tupaki Desk | 18 April 2020 6:30 AM GMT19 ఏళ్ల పాటు కాపురంలో అనూహ్యంగా కలతలు.. దాంతో 2017లో విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. 17 ఏళ్ల కొడుకు ఉన్నా.. అదేమీ పట్టనట్టు ఎవరికి వారు తమ జీవితాల్లోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించేశారు. ఇక ఈ ఎపిసోడ్ లో ఓ విదేశీ వనితతో భర్త సహజీవనం సాగిస్తుంటే.. తనకంటే వయసులో ఎంతో చిన్నవాడైన యువహీరోతో సదరు భార్యామణి సహజీవనం సాగించడం షాక్ కి గురి చేసింది. ఈ తతంగం అంతా జనాలకు తెలిసిందే. ఆ జంట ఎవరో కూడా పరిచయం అవసరం లేదు. ది గ్రేట్ డ్యాన్సింగ్ స్టార్ మలైకా అరోరా- ఆర్భాజ్ ఖాన్ జంట గురించే ఇదంతా. ఆర్భాజ్ విడిపోయి విదేశీ వనితతో ప్రేమలో పడితే.. మలైకా ఏమాత్రం తగ్గకుండా తాను వలచిన యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగిస్తోంది. అర్జున్ తో మలైకా ప్రేమ బాంధవ్యానికి 17 ఏళ్ల కుమారుడు ఆర్యన్ ఖాన్ సైతం తన అంగీకారం తెలిపాడు. ఇక కపూర్ కుటుంబంలో అందరూ మలైకాను ఆప్యాయంగా ఆహ్వానం పలికారు. ఒక్క బోనీ కపూర్ తప్ప!
ఇదంతా తెలిసిన స్టోరీనే .. అయితే విడాకుల తర్వాత స్టోరీనే జనాలకు తెలిసింది తక్కువ. బ్రేకప్ వ్యవహారం తర్వాత మలైకా ఓ ఈవెంట్ కి అతిధిగా ఎటెండవ్వాల్సి ఉండగా అక్కడ పెద్ద రుబాబ్ నడిచిందన్నది కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. అసలింతకీ అక్కడ ఏమైంది? అంటే... ఈ ఈవెంట్ అతిధి `మలైకా అరోరా ఖాన్` అంటూ ఈవెంట్ ప్రతినిధులు తెలిసో తెలియకో బ్యానర్ లో అచ్చు వేసేశారట. దాంతో తన పేరు పక్కనే ఉన్న `ఖాన్` ని చూసి వెంటనే ఈవెంట్ ని వదిలి రుసరుసా వెళ్లిపోయిందట మలైకా. ఆ బ్యానర్ నుంచి `ఖాన్` అన్న తోకను తొలగిస్తేనే ఈవెంట్ కి అటెండవుతానని వార్నింగ్ ఇచ్చింది. అసలు ఆ తోక పేరు ఉండడంపై గరమగరమగా ఫీలైన మలైకా ససేమిరా అనేసిందట. ఎలాగోలా ఆ బ్యానర్ లో పేరును తొలగించడంతో మలైకా శాంతించిందని తెలిసింది.
అయితే ఈ వ్యవహారం మొత్తం ప్రత్యక్షంగా చూసిన వారు మలైకా పై రకరకాలుగా గుసగుసలు స్టార్ట్ చేయడంతో అవి కాస్తా బాలీవుడ్ మీడియాకి లీకై ఇదిగో ఇలా అన్నిచోట్లా వైరల్ అయిపోతోంది. మలైకా ప్రస్తుతం స్టేజీ షోలు.. ఫ్యాషన్ ఈవెంట్లు .. వాణిజ్య ప్రకటనలు అంటూ నాలుగు చేతులా ఆర్జిస్తున్నా .. సినీఛాన్సులు మాత్రం నిల్ అయిపోయాయి. త్వరలోనే కొడుకు ఆర్యన్ ని హీరోని చేసేందుకు కంకణం కట్టుకుందని తెలుస్తోంది. అటు అర్జున్ మాత్రం సినిమాలతో బిజీ అవుతున్నాడు.