Begin typing your search above and press return to search.
కన్ను గీటి 'అంతా నా ఇష్టం' అంది!
By: Tupaki Desk | 10 April 2019 4:32 PM GMTవింక్ సెన్సేషన్ ప్రియా వారియర్ కన్నుగీటి ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియా వింక్ సెన్సేషన్స్ గురించి ఇప్పటికీ చర్చ సాగుతూనే ఉంది. అయితే ప్రియాతో పోటీపడుతూ 40 ప్లస్ వయసు ముగ్ధ మనోహరి కన్నుగీటి సంచలనానికి తావిచ్చింది. కన్ను గీటడమే కాదు.. అంతా నా ఇష్టం .. నాకు నచ్చినట్టే ఉంటాను! అంటూ టీజ్ చేయడం ప్రస్తుతం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ ఎవరా ముగ్ధ మనోహరి అంటే? ది మోస్ట్ కాంట్రవర్శియల్ బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాఖాన్. ఈ అమ్మడి ఘాటైన ఎఫైర్ గురించి గత కొంతకాలంగా వేడెక్కించే చర్చ సాగుతోంది. యువ హీరో అర్జున్ కపూర్ తో జోరుగా షికార్లు చేస్తూ నిరంతరం అంతర్జాలాన్ని వేడెక్కిస్తూనే ఉంది. ఇటీవలే అర్జున్ తో కలిసి విదేశాల్లో బికినీ బీచ్ విహారం చేసిన సంగతి తెలిసిందే. అతడి తో కలిసి నచ్చినట్టు ఎంజాయ్ చేసిన మలైకాకు నెటిజనుల నుంచి తీవ్రమైన చీవాట్లు ఎదురయ్యాయి. అర్జున్ తో కలిసి బికినీ బీచ్ లో సెలబ్రేట్ చేసుకున్న మలైకా ఫోటోలు అంతర్జాలంలో లీకవ్వడంతో వేడెక్కించే చర్చ సాగింది.
అయితే తనని ట్రోల్ చేస్తున్న నెటిజనులకు మలైకా రివర్స్ కోటింగ్ ఇవ్వడం చర్చకొచ్చింది. కొంటెగా కన్నుగీటి ఆ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ``నాకు ఇలా స్వేచ్ఛగా - సంతోషంగా ఉండడం అంటేనే ఇష్టం. నా ముఖంపై సంతోషం కనిపిస్తేనే అందంగా ఉంటాను. అందుకోసం నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. మీకు నచ్చకపోతే మూసుకొని కూర్చొండి. మీ నెగిటివిటి మీరే మడిచి పెట్టుకొండి. చెత్త కామెంట్లు అవసరం లేదు!!`` అంటూ మలైకా ఘాటుగానే తిట్టేసింది. మొత్తానికి మలైకా ఈ కామెంట్లతో తనని ట్రోల్ చేస్తున్న వారందరికీ ధీటైన సమాధానమే ఇచ్చిందన్న ముచ్చటా సాగుతోంది. అన్నట్టు ఈ నెలలోనే అర్జున్ ని పెళ్లాడేస్తోందా? అంటే అందుకు మాత్రం సరైన ఆన్సర్ లేదు.