Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మలైకం వశిష్ఠాసనం..!

By:  Tupaki Desk   |   11 Sep 2019 4:32 AM GMT
ఫోటో స్టొరీ: మలైకం వశిష్ఠాసనం..!
X
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నెటిజన్లకు.. వారిలో కుర్రమనసు ఉండే నెటిజన్లకు పరిచయం అవసరం లేని పేరు మలైకా అరోరా. వయసు నలభై ఐదు అయినా కానీ ఇరవై ఐదులా కనిపించడం మలైకాకు మాత్రమే సొంతమైన స్పెషాలిటీ. గతంలో కూడా మలైకా ఫేమస్సే కానీ ఇప్పుడు తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ను డేటింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మలైకా సోషల్ మీడియాలో ఉన్న హాటు బాంబుల్లో ఒకరు. ఈ వయసులో కూడా బికినీ వేసిందంటే సోషల్ మీడియా షేక్ అయిపోవాల్సిందే. అయితే దీని వెనక ఎంత కఠోర శ్రమ ఉంటుందనేది తక్కువ మందికే తెలుస్తుంది. అమెజాన్ లోనూ ఫ్లిప్ కార్ట్ లోనో పేటీయమ్ కూపన్లు పెట్టి బికినీని ఎవరైనా ఆర్డర్ చేయగలరు. అంతకంటే సులువుగా వేసుకోగలరు. అయితే ఆ బికినీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటే రామ్ గోపాల్ వర్మకు ఉన్నంత గట్స్ ఉండాలి. ఆ గట్స్ తో పాటు కావాల్సింది పర్ఫెక్ట్ బికినీ షేప్. ఆ షేప్ నాచురల్ గా వస్తుందని అనుకోవడం ఓ భ్రమ. ఒకవేళ అలా వచ్చినా ఎక్కువ రోజులు ఉండదు. దానికి మంచి డైట్ తో పాటుగా రెగ్యులర్ గా ఎక్సర్ సైజులు చేయాలి. ఆ విషయంలో మలైకా అరోరా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటుంది. యోగా.. ఏరోబిక్సు.. ఇంకా ఏవైనా మిగిలి ఉంటే జిమ్నాస్టిక్సు అనీ ఎడాపెడా చేసిపారేసి ఒక్క గ్రాము కూడా అనవసరమైన ఫ్యాట్ తన బాడీలో చేరకుండా జాగ్రత్త తీసుకుంటుంది. అందుకే ఈ వయసులో కూడా అంత ఫిట్ గా ఉండగలుగుతుంది. అంతే కాదు.. ఫేస్ లో కూడా ఆ గ్లో ఉందంటే దానికి కారణం యోగానే. పైనున్న ఫోటోలో మలైకా పోజు చూస్తే మనకు అసలు విషయం అర్థం అవుతుంది. ఆ విధంగా చేతిని నేలపై ఆన్చి.. పాదంలో పాతిక శాతమే నేలకు ఆన్చి ఆ పోజు ఇవ్వాలంటే బాడీలో ఎంత బ్యాలెన్స్ ఉండాలి?

ఈ ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ మలైకా ఇచ్చిన క్యాప్షన్ చాలా పెద్దది. క్లుప్తంగా చెప్పుకుంటే "దివ్య యోగా లో మరో అద్భుతమైన వర్క్ అవుట్. ప్లాంక్స్ అంటే నాకు చాలా ఇష్టం.. అందులోనూ ఈ సైడ్ ప్లాంక్ చాలా టఫ్. 30 సెకన్లు అలా ఉండడం చాలా చాలా కష్టం. ఇది నేను వేసిన వశిష్ఠాసనం" అంటూ ఫోటో గురించి వివరించింది. ఒక్కోసారి ఫోటోను చూస్తే చాలు. కామెంట్లు.. క్యాప్షన్లు అవసరం లేదు. అదేదో ఫేమస్ కొటేషన్ లాగా "ఎ పిక్చర్ స్పీక్స్ థౌజండ్ వర్డ్స్".. అండ్ ఇట్ రియల్లీ ఈజ్ స్పీకింగ్ థౌజండ్ వర్డ్స్..!