Begin typing your search above and press return to search.
యంగ్ హీరోతో ఎఫైర్ పై స్పందించిన హీరోయిన్
By: Tupaki Desk | 24 Nov 2016 6:09 AM GMTపవన్ గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అంటూ ఆడియెన్స్ ను కేక పెట్టించిన హాట్ ఐటెం గర్ల్ మలైకా అరోరా కొద్ది రోజులుగా పర్సనల్ లైఫ్ మ్యాటర్ తో వార్తల్లో ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ను పెళ్లి చేసుకున్న మలైకా కొద్ది రోజులుగా విడిగా ఉంటోంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
బోనీకపూర్ కుమారుడు - బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో మలైకా సన్నిహితంగా ఉంటోందని, వీరి మధ్య ఎఫైర్ ఉందంటూ కూడా వార్తలు పలువలు చిలవలుగా ప్రచారం అవుతున్నాయి. అర్జున్ తో ఎఫైరే మలైకా - అర్బాజ్ ఫ్యామిలీలో చిచ్చుకు కారణమైందన్న టాక్ కూడా వచ్చింది. ఇక నెల రోజుల క్రితం మలైక అర్ధరాత్రి టైంలో అర్జున్ ఇంటి నుంచి బయటకు రావడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ వార్తలకు మరింత బలం వచ్చినట్లయ్యింది.
ఇక మలైకా బావ సల్మాన్ ఈ జంటను కలిపేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. అర్జున్ తో ఎఫైర్ మ్యాటర్ పై మలైకా తొలిసారిగా స్పందించింది. అర్జున్ తనకు చాలా మంచి స్నేహితుడు అని...తమ ఇద్దరి గురించి ప్రజలు చాలా అపార్థం చేసుకుంటున్నారని ఆమె చెప్పింది. మలైక దీనిపై స్పందించినా బీ టౌన్ మీడియా మాత్రం వీరిద్దరి బంధం గురించి రకరకాల ఎవిడెన్సులతో ప్రచారం ఊదరగొట్టేస్తోంది.
ఇక వీరిద్దరి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నలుగుతోంది. ఇక ఇటు మలైకా అర్జున్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తుంటే అటు అర్బాజ్ సైతం మరో అమ్మాయితో ప్రేమలో మునిగి తేలుతున్నాడట. ఈ గ్యాపే వీరి బంధం బ్రేకప్‌కు కారణమైందని రుమర్లు వినిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/