Begin typing your search above and press return to search.

మాలతి మేరీ... గ్లోబల్‌ హాట్‌ స్టార్ కూతురు పేరట!

By:  Tupaki Desk   |   21 April 2022 1:30 PM GMT
మాలతి మేరీ... గ్లోబల్‌ హాట్‌ స్టార్ కూతురు పేరట!
X
బాలీవుడ్‌ సినిమాల్లో నటించి వెండి తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు వలస వెళ్లింది. అక్కడ హాలీవుడ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల్లో నటించి.. పలు షో ల్లో కనిపించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకుంది. గ్లోబల్‌ హాట్ బ్యూటీగా.. హాలీవుడ్‌ స్టార్‌ గా మంచి పేరును దక్కించుకున్న ప్రియాంక చోప్రా అంతర్జాతీయ సెలబ్రెటీ అయిన నిక్ జోనస్ ను వివాహం చేసుకుంది.

ప్రియాంక చోప్రా కంటే నిక్ పదేళ్లు చిన్నవాడు అయినా కూడా వీరిద్దరి మద్య ఉండే ప్రేమ కు ఎన్ని మార్కులు వేసినా తక్కువే. అందుకే వీరిద్దరి జోడీ ఎవర్ గ్రీన్‌ గా ఉంటుందని అభిమానులు అంటూ ఉంటారు. ఇక ఈ క్యూట్‌ కపుల్‌ కు ఇటీవలే ఒక క్యూట్‌ బేబీ జన్మించింది. సరోగసి ద్వారా ప్రియాంక చోప్రా తల్లి అయ్యింది. అమ్మాయికి జన్మనిచ్చిన ప్రియాంక చోప్రా ఇప్పటి వరకు ఆ విషయం పై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

ఇప్పటి వరకు అమ్మాయి అబ్బాయి అనే విషయంలో కూడా అధికారికంగా ప్రకటన రాలేదు. అమ్మాయి అని ప్రియాంక చోప్రా సన్నిహితుల ద్వారా తెలిసింది. జనవరి 15వ తారీకున అమెరికాలో జన్మించిన పాపాయికి నామకరణం జరిగిందట. ఇటీవలే అమెరికాలో పాపకు బర్త్ సర్టిఫికెట్‌ ను తీయించడం జరిగిందట. ఆ బర్త్‌ సర్టిఫికెట్‌ లో అమ్మాయికి పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్‌ మరియు హాలీవుడ్‌ మీడియాలో గత రెండు మూడు రోజులుగా వస్తున్న వార్త కథనాల అనుసారంగా నిక్ మరియు ప్రియాంక చోప్రా లు వారి పాపకు మాలతి మేరి చోప్రా జోనస్ అని పేరు పెట్టారట. ఈ విషయాన్ని చాలా మీడియా సంస్థలు దృవీకరిస్తున్నారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కాని చాలా నమ్మకంగా బర్త్‌ సర్టిఫికెట్‌ లో ఈ పేరు ఉందని వాదిస్తున్న వారు ఉన్నారు.

ఈమద్య కాలంలో సెలబ్రెటీలు తల్లి మరియు తండ్రి పేరు మరియు వారి యొక్క అభిరుచికి తగ్గట్లు పేర్లను వారి వారి పిల్లలకు పెట్టుకుంటున్నారు. కనుక ఈ పేరు వార్తలు నిజం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తక్కువ శాతం మంది మాత్రం ఈ పేరు వార్తలను నమ్మడం లేదు. రెండు విభిన్నమైన సంస్కృతులకు తగ్గ పేరును మరియు తల్లిదండ్రి యొక్క ఇంటి పేరును కూడా కొనసాగించేలా ఆ పేరు ఎంత వరకు వరకు కరెక్ట్‌ అనేది తెలియాల్సి ఉంది.