Begin typing your search above and press return to search.

మాస్టర్ పీస్‌ ప్రభాస్ సినిమాపై క్లారిటీ ఇచ్చేసింది

By:  Tupaki Desk   |   8 March 2022 8:30 AM GMT
మాస్టర్ పీస్‌ ప్రభాస్ సినిమాపై క్లారిటీ ఇచ్చేసింది
X
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా లో హీరోయిన్ గా నటించిన మాళవిక మోహనన్‌ కు మంచి గుర్తింపు దక్కింది. తమిళంలో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. కాని ఈ అమ్మడికి కోలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వాలనే ఆసక్తి మరియు కోరిక చాలా కాలంగా ఉన్నాయట. కాని ఆమెకు తెలుగు లో మాత్రం సరైన ఆఫర్‌ రాలేదు.

ఆమద్య విజయ్ దేవరకొండ తో ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కాని ఆ సినిమా ఆరంభం కాకుండానే క్యాన్సిల్‌ అయ్యింది. దాంతో మళ్లీ ఆఫర్‌ రావడానికి ఇన్నాళ్ల సమయం పట్టింది. ఎట్టకేలకు ప్రభాస్ కు జోడీగా ఈమె రాజా డీలక్స్ సినిమా లో మారుతి దర్శకత్వంలో నటించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.

రాజా డీలక్స్ గురించి వందల కొద్ది పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో హీరోయిన్ విషయమై వస్తున్న వార్తలు ఎంత వరకు నిజం అనేది క్లారిటీ లేదు. ఈ సమయంలో మాళవిక మోహనన్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగు లో తాను ఒక సినిమాను చేయబోతున్నాను. అది ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా. నాకు తెలుగు లో ఒక మంచి ఎంట్రీ ఆ సినిమా తో దక్కతుంది అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

ప్రస్తుతానికి ఆ సినిమాకు సంబంధించిన విషయాలను ఇంతకు మించి రివీల్‌ చేయలేను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈమద్య కాలంలో ప్రభాస్ కు జోడీగా ఈమె నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. మరే హీరో తో ఈమె నటించే విషయమై ప్రచారం జరగలేదు. కనుక ఈ అమ్మడు తెలుగు లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన సినిమా ప్రభాస్ తోనే అయ్యి ఉంటుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

తన అందాల ఆరబోతతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు ముందు ముందు తన సినిమాలతో పాత్రలతో ఆకట్టుకుంటుందేమో చూడాలి. మాస్టర్ సినిమాలో చాలా పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు రియల్‌ లైఫ్‌ లో అందుకు పూర్తి విభిన్నం అంటూ ఇప్పటికే ఆమె ఇన్‌ స్టా ఫోటోలను చూస్తే అర్థం అవుతుంది.

భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న రాజా డీలక్స్ సినిమాలో ఈ అమ్మడు ఉండటం వల్ల ఖచ్చితంగా ప్లస్ అవుతుందని అంటున్నారు. రాధేశ్యామ్‌ సినిమా విడుదల అయిన వెంటనే ప్రభాస్ నుండి రాజా డీలక్స్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.