Begin typing your search above and press return to search.
మాళవికా మోహనన్ డ్రీమ్ నెరవేరేనా?
By: Tupaki Desk | 18 May 2022 1:03 PM GMTసూపర్ స్టార్ తో `పేట్టా`. దళపతి విజయ్ తో `మాస్టర్` వంటి చిత్రాల్లో నటించిన మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది మాళవికా మెహనన్. అయితే హీరోయిన్ గా మాత్రం ఇంత వరకు సరైన హిట్‌ని, సరైనా పాత్రని సొంతం చేసుకోలేకపోయింది. నటించిన ప్రతీ చిత్రంలోనూ ప్రాధాన్యత లేని పాత్రల్లోనే కనిపించింది మాళవిక. ప్రముఖ సినీమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన మాళవిక కు కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు క్రేజీ ఆఫర్లే లభించాయి.
కానీ అవి ఏ మాత్రం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేకపోయాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `పేట్ట`లో అవకాశం లభించింది. కానీ పాత్రకు తగ్గ ప్రాధాన్యతలేదు. ఇక విజయ్ నటించిన `మాస్టర్`లోనూ ఇదే పరిస్థితి. పేరుకు హీరోయిన్ రోల్ కానీ విజయ్ తో ఎక్కువగా సన్నివేశాలు లేవు. రొమాంటిక్ సీన్ కానీ, సాంగ్ కానీ లేదు. ఒక్కటంటే ఒక్క డ్యుయెట్ కూడా లేదు. దీంతో మాళవికకు `మాస్టర్` పెద్దగా కలిసి రాలేదు. ఇటీవల ధనుష్ తో `మారన్` సినిమా చేసినా అది కాస్తా ఓటీటీకే పరిమితం కావడంతో తనకు పెద్దగా పేరు రాలేదు.
ఇటీవల సోషల్ మీడియాలో వరుస ఫొటో షూట్ లతో హల్ చల్ చేస్తున్న మాళవిక ప్రస్తుతం హిందీలో `యుధ్ర`పేరుతో రూపొందుతున్న మూవీలో నటిస్తోంది. తన ఆశలన్నీ ఇప్పడు ఈ మూవీపైనే వున్నాయి. ఇదైనా హీరోయిన్ గా తన కెరీర్ ని కొత్త మలుపు తిప్పుతుందని భారీ అంచనాలే పెట్టుకుందట. ఇదిలా వుంటే సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా వుండే మాళవిక మోహనన్ బుధవారం #AskMalavika అంటూ అభిమానులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఇందులో పాల్గొన్న అభిమానులు పలు ఆసక్తికరమైన ప్రశ్నల్ని సంధించారు. వాటన్నింటీకీ కూల్ గా సమాధానం చెప్పింది. అయితే ఓ అభిమాని `తమిళ బిగ్ స్టార్స్ అయిన రజనీకాంత్, విజయ్ లతో కలిసి నటించారు. ఇప్పడు ఎవరితో కలిసి నటించాలని ఎదురుచూస్తున్నారు? అని ప్రశ్నిస్తే ఆసక్తికర సమాధానం చెప్పింది. విజయ్ దేవరకొండ తో కలిసి రొమాంటిక్ లేదా రోమ్ కోమ్ సినిమా చేయాలని వుందని తన మనసులోని మాటని బయటపెట్టింది. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఆనంద్ అన్నామలై ని దర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ హీరోగా ఓ మూవీని ప్రారంభించారు.
అందులో హీరోయిన్ మాళవిక మోహనన్. హీరో పేరుతో ఈ మూవీని ప్రారంభించాలనుకున్నారు. బైక్ రేసర్ గా విజయ్ దేవరకొండ పాత్రని డిజైన్ చేశారు. ఢిల్లీ నేపథ్యంలో సాగే కథ కావడంతో త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ అర్థాంతరంగా ఆగిపోయింది. దీంతో తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి నటించాలన్న మాళవిక మోహనన్ కల కలగానే మిగిలిపోయింది. అయితే ఇప్పటికైనా మాళవిక కల నెరవేరుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.