Begin typing your search above and press return to search.

ఈమె అందం ముందు ప్రకృతి అందం చిన్నబోయింది!

By:  Tupaki Desk   |   2 March 2022 4:33 AM GMT
ఈమె అందం ముందు ప్రకృతి అందం చిన్నబోయింది!
X
కేరళ బ్యూటీ మాళవిక మోహనన్‌ తన అందాల విందు తో ఈమద్య సోషల్ మీడియా లో సూపర్ స్టార్‌ గా మారిపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు మరో సూపర్ స్టార్‌ విజయ్‌ లతో సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో ఈమె షేర్ చేసిన హాట్‌ ఫోటోలు మరియు వీడియోల వల్ల దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. అందంతో పాటు మంచి ఫిజిక్ ను కలిగి ఉన్న ఈమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.

హీరోయిన్‌ గా తెలుగు లో ఎంట్రీ ఇచ్చేందుకు ఈమె చాలా ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే రాజా డీలక్స్ సినిమా లో ప్రభాస్ కు జోడీగా ఒక హీరోయిన్ గా ఈమెను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ముగ్గురు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఆ ముగ్గురిలో ఒక్కరిగా ప్రభాస్ తో ఈమె రొమాన్స్ కు సిద్దం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదే సమయంలో ఈ అమ్మడి సోషల్ మీడియా సెన్షేషన్‌ కంటిన్యూ అవుతోంది. హీరోయిన్ గా వస్తున్న ఆఫర్లు చాలా తక్కువ అయినా కూడా హాట్‌ ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటుంది. ఇటీవల బికినీ ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అయిన ఈమె తాజాగా ఈ ఫోటోను షేర్‌ చేసి అబ్బుర పర్చుతోంది. ఈసారి థైస్‌ ను ఎక్స్‌ పోజ్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సహజంగా అయితే సూర్యోదయం మరియు సూర్యాస్తమయం అంటే ఎవరికి అయినా చాలా ఇష్టం ఉంటుంది. ఆ అందం ముందు ఏ అందం అయినా దిగదుడుపే అంటారు. కాని ఇక్కడ ఆ సూర్యుడి అందంనే డామినేట్ చేసే విధంగా ఈమె ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అలా సన్‌ సెట్‌ అవుతున్న సమయంలో ఈమె తన అందాల థైస్ ను ఎక్స్ పోజ్‌ చేస్తూ వెనక్కు తిరిగి మరీ ఫోటో కు ఫోజ్‌ ఇవ్వడం చాలా బాగుందంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అమ్మడి అందంకు ఖచ్చితంగా పాన్ ఇండియా స్టార్‌ డం దక్కడం ఖాయం అని.. ముందు ముందు కాస్త ఓపికగా ఈమె ఆఫర్ల కోసం ఇలాగే ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మరియు సినీ వర్గాల వారిని ఆకట్టుకునే అందం ఈమెది. కనుక తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ఎందుకు ఈమె పై దృష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదు.