Begin typing your search above and press return to search.

నాపై ట్రోల్స్‌ చూసి న‌వ్వ‌లేక చ‌చ్చా - న‌టి

By:  Tupaki Desk   |   4 Feb 2021 12:30 AM GMT
నాపై ట్రోల్స్‌ చూసి న‌వ్వ‌లేక చ‌చ్చా - న‌టి
X
‘పేట’ సినిమాలో తన యాక్టింగ్ తో అందరి దృష్టినీ ఆకర్షించింది నటి మాలవికా మోహనన్. ఆ తర్వాత ఈ బ్యూటీ మరో భారీ చిత్రంలో నటించింది. దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’లో ఓ పాత్ర‌లో నటించింది మాలవికా. ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుందీ అమ్మడు. అయితే.. ఈ సినిమాలో మాలవికా చేసిన క్యారెక్టర్ పై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

పెద్దగా ప్రాధాన్యత లేని క్యారెక్టర్ ను మాలవికా సెలక్ట్ చేసుకుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఆమె పాత్ర చుట్టూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన నటి.. దీనిపై స్పందించింది.

‘ఈ మీమ్స్ చాలా హిలేరియస్ గా ఉన్నాయి. వీటిని చూసి నవ్వుతూనే ఉన్నాను. ముఖ్యంగా.. టూత్‌పేస్ట్ తో తయారు చేసిన మీమ్ చూసి నవ్వలేక చచ్చాను. అయినా.. నవ్వకపోతే జీవితమే బోర్ కదా?’ అంటూ ట్వీట్ చేసింది మాలవికా.

ఈ ట్వీట్ ను ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. విమర్శలను సానుకూలంగా తీసుకుని, త‌మ‌ లక్ష్యం వైపు ప్ర‌యాణించే మ‌న‌సు అంద‌రికీ ఉండ‌దు. కానీ.. మాలవికా మాత్రం త‌న‌దైన బిహేవియ‌ర్ తో అంద‌రి హృదయాలను గెలుచుకుంటోంది. మరింత ఫాలోయింగ్ కూడా సంపాదిస్తోంది. ప్ర‌స్తుతం కార్తీక్ నరేన్ చిత్రంతో ఆమె బిజీగా మాల‌వికా మోహ‌న‌న్‌.