Begin typing your search above and press return to search.

`మాస్ట‌ర్` ఫ్లాప్ తో ఈ బ్యూటీ స‌న్నివేశ‌మేంటి?

By:  Tupaki Desk   |   2 Feb 2021 5:00 PM IST
`మాస్ట‌ర్` ఫ్లాప్ తో ఈ బ్యూటీ స‌న్నివేశ‌మేంటి?
X
మాలీవుడ్ బ్యూటీ మాళ‌విక మోహ‌న‌న్ సోష‌ల్ మీడియా స్టంట్ గురించి తెలిసిన‌దే. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ఈ అమ్మడు ఇప్ప‌టికే కుర్ర‌కారు గుండెల్లోకి దూసుకెళ్లింది. కానీ ఈ భామ కెరీర్ ఆశించినంత జెట్ స్పీడ్ అందుకునేందుకు ఆస్కారం కనిపించడం లేద‌న్న సింప్ట‌మ్స్ బ‌య‌ట‌ప‌డ‌డ‌మే బ్యాడ్ ల‌క్.

ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ మోహ‌న‌న్ కుమార్తెగా తెర‌కు ప‌రిచ‌యం అయినా త‌న‌వైన అంద‌చందాలు యాక్టివ్ నెస్ తో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్ని ఆక‌ర్షించిన మాళ‌విక సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పేట (పెట్టా -త‌మిళ్) లో న‌టించింది.

ఆ తర్వాత ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న మాస్ట‌ర్ లోనూ త‌నే నాయిక‌. కానీ ఏం ప్ర‌యోజనం? మాస్ట‌ర్ త‌మిళంలో ఫ‌ర్వాలేద‌నిపించినా.. తెలుగు ఆడియెన్ ని ఏమంత మెప్పించ‌లేక‌పోయింది. దీంతో ఈ బ్యూటీ ఇటు తెలుగు ప‌రిశ్ర‌మ‌లో బిజీ అయ్యే ఛాన్స్ లేకుండా పోయింది. ఇంత‌కుముందే దేవ‌ర‌కొండ స‌ర‌స‌న హీరో చిత్రంలో అవ‌కాశం అందుకుంది. కానీ ఆ మూవీకి కొంత చిత్రీక‌ర‌ణ సాగాక బ్రేక్ ప‌డింది. ఇప్పుడు మాస్ట‌ర్ ఏమంత మెప్పించ‌లేదు. దీంతో మాళ‌విక టాలీవుడ్ కెరీర్ పై నీలినీడ‌లు అలుముకున్నాయి. ఇంత‌కుముందు బ‌న్ని.. చ‌ర‌ణ్ వంటి బ‌డా స్టార్లు ఈ అమ్మ‌డికి అవ‌కాశం ఇస్తున్నార‌ని ప్ర‌చారమైనా ఇప్పుడు ఏ క‌ద‌లికా లేదు. మ‌రి ఒక ఫ్లాప్ ప్ర‌భావం అంత‌గా కెరీర్ పై ఉంటుందా? అంటే దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.