Begin typing your search above and press return to search.
మాళవిక మేజర్ అయ్యింది
By: Tupaki Desk | 5 Jan 2016 5:03 AM GMTఎవడే సుబ్రమణ్యం? సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్. ఆ సినిమాలో ఆమె నటననీ, ఆమె కనిపించిన తీరును గమనిస్తే మాళవిక చాలా సీనియర్ అన్న అభిప్రాయం కలుగుతుంది. మెచ్యూరిటీ ఉన్న ఆ పాత్రలో అంత బాగా ఒదిగిపోయింది. కానీ మాళవిక మనం అనుకొంటున్నట్టుగా సీనియరేమీ కాదు. ప్లస్ టు చదువుతోందిప్పుడు. తెరపై అలా కనిపిస్తోందేమో కానీ... ఆమె నిన్ననే మేజర్ అయ్యింది. సోమవారమే ఆమె తన 18వ పుట్టినరోజు వేడుకని కళ్యాణ వైభోగమే టీమ్ తో కలిసి జరుపుకుంది. ఈ సందర్భంగా కొత్త నిర్ణయాల్ని ప్రకటించింది. తెలుగు ఇండస్ట్రీ చాలా బాగుందని, ఇకనుంచి ఇక్కడే కంటిన్యూ అవుతానని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికప్పుడు ఏ సినిమా ఒప్పుకోననీ, మార్చిలో పరీక్షలు పూర్తి చేశాకే కొత్త సినిమాల గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చింది.
ఇంత చిన్న వయసులో అంత మెచ్యూర్ క్యారెక్టర్లు ఎలా చేస్తున్నావని అడిగితే... ``నా మనసుకు ఒక పాత్ర దగ్గరైందంటే చాలు.. అందులో ఇట్టే ఒదిగిపోతా. పైగా చిన్నప్పట్నుంచీ నేను నటిస్తున్నా. పలు సినిమాల్లో అక్కగా, చెల్లిగా నటించిన అనుభవం ఉంది. అందుకే పాత్రల్ని తొందరగా ఆకళింపు చేసుకొంటుంటా`` అని చెప్పుకొచ్చింది మాళవిక. సొంత రాష్ట్రం కేరళనే అయినా... తన కుటుంబం మాత్రం ఢిల్లీలోనే ఉంటుందట. అయితే ఇప్పటిదాకా ఆమె సైన్స్ చదువుకున్నప్పటికీ ఇక నుంచి మాత్రం ఆర్ట్స్ చదువులపై దృష్టిపెట్టాలని నిర్ణయించుకొందట మాళవిక. నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ... పెయింట్స్ మాత్రం అద్భుతంగా వేస్తానంటోందీ కేరళ కుట్టి.