Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్‌ కు విజయ్‌ చాలా ప్రత్యేకమట!

By:  Tupaki Desk   |   21 Nov 2018 12:10 PM IST
ఆ హీరోయిన్‌ కు విజయ్‌ చాలా ప్రత్యేకమట!
X
విజయ్‌ దేవరకొండ సినిమా సినిమాకు తన స్టార్‌ డంను పెంచుకుంటూ పోతున్నాడు. ‘గీత గోవిందం’ చిత్రంతో స్టార్‌ హీరో అంటూ పిలిపించుకుంటున్న విజయ్‌ దేవరకొండ ‘నోటా’ చిత్రంతో కాస్త నిరాశ పర్చినా కూడా ‘ట్యాక్సీవాలా’తో మరోసారి తన అభిమానులను ఎంటర్‌ టైన్‌ చేశాడు. ఇండస్ట్రీలో కొద్ది మందితో మాత్రమే విజయ్‌ క్లోజ్‌ గా ఉంటాడనే టాక్‌ ఉంది. అలాంటి విజయ్‌ దేవరకొండకు హీరోయిన్‌ మాళవిక నాయర్‌ తో అత్యంత సన్నిహితం ఉంటుందట. ఆ విషయాన్ని హీరోయిన్‌ మాళవిక చెప్పుకొచ్చింది.

విజయ్‌ దేవరకొండ కీలక పాత్ర పోషించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో మాళవిక నాయర్‌ హీరోయిన్‌ గా నటించిన విషయం తెల్సిందే. అప్పటి నుండి వీరి స్నేహం కొనసాగుతూ వస్తుండట. ఇప్పటి వరకు మాళవిక చేసిన అయిదు సినిమాల్లో మూడు సినిమాల్లో విజయ్‌ దేవరకొండ నటించాడు. తాజాగా ట్యాక్సీవాలా చిత్రంలో కూడా హీరోయిన్‌ పాత్ర కాకున్నా కూడా విజయ్‌ దేవరకొండ మూవీ అనే ఉద్దేశ్యంతో కీలక పాత్రలో మాళవిక నటించింది.

తాజాగా మాళవిక మాట్లాడుతూ.. విజయ్‌ నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు. ఆయనతో కలిసి నేను ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించాను. నేను చేసిన అయిదు తెలుగు సినిమాల్లో మూడు విజయ్‌ దేవరకొండతో కలిసి నటించాను. అలా ఇద్దరం క్లోజ్‌ అయ్యాం. విజయ్‌ నాకు చాలా ప్రత్యేకమైన మిత్రుడు అంటూ మాళవిక నాయర్‌ చెప్పుకొచ్చింది. సినిమాల సంఖ్య పెరుగుతున్నా కొద్ది విజయ్‌ మానసికంగా బలంగా అవుతున్నాడని, ఆయనపై వస్తున్న విమర్శలను సమర్థంగా ఎదుర్కొంటున్నాడని పేర్కొంది. ముందు ముందు కూడా తనతో కలిసి నటించాలని భావిస్తున్నట్లుగా మాళవిక చెప్పుకొచ్చింది.