Begin typing your search above and press return to search.
హైదరాబాద్ హైకోర్టులో జూనియర్ న్యాయవాదిగా యువనటి?
By: Tupaki Desk | 8 April 2021 5:30 AM GMTముంబై గాళ్ మాళవిక శర్మ వృత్తిరీత్యా కథానాయిక అయినా ప్రవృత్తి రీత్యా లాయర్ అన్న సంగతి తెలిసిందే. తాను చాలాసార్లు ఇంటర్వ్యూల్లో ఆ సంగతిని వెల్లడించారు. 2018 లో రవితేజ నేల టికెట్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ లా విద్యార్థిని ఆ తర్వాతా సినిమాల్లో కొనసాగుతున్నారు. ఇటీవల రామ్ సరసన రెడ్ లో కనిపించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో కలిసి `ఆహా` ప్రమోషనల్ వీడియోలోనూ మాళవిక నటించారు.
ప్రవృత్తి రీత్యా లాయర్ కాబట్టి ఆ వృత్తిని మాళవిక విడిచిపెట్టడం లేదు. మాళవిక శర్మ హైదరాబాద్ హైకోర్టులో జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారని తాజాగా తెలుస్తోంది. 2020 నవంబర్ లో ముంబైలోని రిజ్వి లా కాలేజీ నుండి మాళవిక ఎల్.ఎల్.బిలో పట్టభద్రురాలయ్యారు. జనవరి 2021 లో మహారాష్ట్ర - గోవాలోని బార్ కౌన్సిల్ నుండి లైసెన్స్ పొందారు.
ముంబై విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.ఎమ్ లోనూ మాళవిక ప్రవేశం పొందారు. ఆమె ప్రవేశ పరీక్షను క్లియర్ చేసారని తెలిసింది. ప్రస్తుతం క్రిమినాలజీలో నైపుణ్యం పొందాలని భావిస్తున్నారు. లాయర్ ప్రవృత్తిని కొనసాగిస్తూనే టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులపై సంతకం చేయడానికి కూడా మాళవిక ఆసక్తిగా వేచి చూస్తున్నారట. క్రిమినాలజీ సబ్జెక్టులోనూ పట్టా అందుకోవాలనే తపనతోనూ ఉన్నారు మాళవిక. యువనాయిక పట్టుదల గ్రేట్ అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.