Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: ఉపవాస జాగారాలే కాదు ఇలా తపమాచరించాలి!
By: Tupaki Desk | 11 March 2021 12:30 PM GMTసంక్రాంతి తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. ఈ రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి.... దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కోసం నిదర పోకుండా (జాగరణ) మేలుకొని భక్తిశ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు. సామాన్యులే కాదు.. సెలబ్రిటీ ప్రపంచంలోనూ మహాశివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
నేడు చాలామంది టాలీవుడ్ ప్రముఖులు తమ ఇండ్లలో ఉపవాస ధీక్షలతో పాటు జాగారానికి సిద్ధమవుతున్నారు. ఇక ఉత్తరాది నుంచి వచ్చి తెలుగు చిత్రసీమలో అవకాశాలు అందుకుంటున్న మాళవిక శర్మ కూడా పరమ శివభక్తురాలు అనేందుకు ఇదిగో ఇదే సాక్ష్యం. మాళవిక నేటి రాత్రి జాగారానికి సిద్ధమవుతున్నారు. శివనామస్మరణతో పాటు పూజలు పునస్కారాలు అభిషేకాలతో రేయంతా భక్తి శ్రద్ధలతో శివుని సేవలో నిమగ్నం కానున్నారు.
అంతకుముందే నేడు శివాలయానికి వెళ్లి పూజలాచరించిన మాళవిక ఎంతో సాంప్రదాయ బద్ధంగా ఇలా పట్టు చీరలో దర్శనమిచ్చారు. ఎర్రని కంచి పట్టు చీరలో దేవతనే తలపిస్తోంది మాళవిక. ఆ అందమైన శిరోజాల్ని అలా స్వేచ్ఛగా గాలికి వదిలేసి ఇదిగో ఇలా శివుని గుడిలోనే తపమాచరిస్తూ కనిపించారు. ఆ నుదుటిన పసుపు కుంకుమలతో బొట్టును తీర్చిదిద్ది పార్వతినే తలపిస్తోంది. ``మనలో సామర్థ్యాన్ని గుర్తు చేసి విజయానికి దోహదం చేసే దేవుడు పరమశివుడు. జై శివ శంకర్.. `` అంటూ క్యాప్షన్ ని జోడించారు ఈ ఫోటోలకు. మాళవిక ఇటీవలే రామ్ సరసన రెడ్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తదుపరి వరుసగా కథలు విని ఓకే చెప్పేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది.