Begin typing your search above and press return to search.

బ్యూటిఫుల్ స్మైల్ తో గుండెను గిల్లేసిన మాళ‌విక‌

By:  Tupaki Desk   |   4 March 2021 2:30 AM GMT
బ్యూటిఫుల్ స్మైల్ తో గుండెను గిల్లేసిన మాళ‌విక‌
X
క్రిమిన‌ల్ సైకాల‌జీ చ‌దివి లాయ‌ర్ కావాల‌నుకుని యాక్ట‌ర్ అయ్యింది మాళ‌వికా శ‌ర్మ‌. ఆరంభం వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో బాగా పాపులారిటీ వ‌చ్చేయ‌డంతో అటుపై క‌థానాయిక‌గా కెరీర్ ని ప్రారంభించేందుకు క‌ల‌లు కంది. ఆశించిన‌ట్టే వ‌రుస‌గా ప‌లు భాష‌ల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. టాలీవుడ్ లో మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న నేల టిక్కెట్టు చిత్రంతో అడుగుపెట్టింది. ఆరంగేట్రం ఫ్లాపైనా రామ్ `రెడ్`లో అవ‌కాశం ఇచ్చాడు. ఈ మూవీ 2021 సంక్రాంతి బ‌రిలో రిలీజైంది. అయితే రెడ్ ఆశించినంత విజ‌యం సాధించ‌కపోవ‌డం నిరాశ‌ప‌రిచింది.

అయితే మాళ‌విక అంద‌చందాల‌కు బ్యూటిఫుల్ స్మైల్ కి తెలుగు ఆడియెన్ ఇప్ప‌టికే ఫిదా అయ్యారు. యువ‌త‌రంలో చ‌క్క‌ని ఫాలోయింగ్ ని తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆ క్ర‌మంలోనే టాలీవుడ్ లో ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో మంత‌నాలు సాగిస్తోంద‌ని తెలిసింది. అయితే ఇంత‌వ‌ర‌కూ రెడ్ త‌ర్వాత వేరొక ప్రాజెక్టును ప్ర‌క‌టించ‌లేదు. ఆ ఒక్క ఛాన్స్ కోస‌మే వెయిటింగ్ అని తెలిసింది.

ఇక ఇన్ స్టా వేదిక‌గా మాళ‌విక రెగ్యుల‌ర్ గా ఏదో ఒక కొత్త‌ద‌నం నిండిన ఫోటోషూట్ ని షేర్ చేస్తున్నారు. ఇవ‌న్నీ వైర‌ల్ గా మారుతున్నాయి. ఇంత‌కుముందు స్విమ్ సూట్ ధ‌రించి పూల్ సైడ్ చిలౌట్ చేస్తున్న ఫోటోని షేర్ చేసింది. తాజాగా బ్లాక్ డిజైన‌ర్ లాంగ్ సైజ్ లెహంగా లో క‌నిపించింది. అర్చితా నారాయ‌ణ‌ రూపొందించిన డిజైన్ ఇది. మాళ‌విక సింపుల్ గా స్మైల్ ఇస్తూ ఈ డిజైన‌ర్ లుక్ లో ఎంతో బ్యూటిఫుల్ గా క‌నిపిస్తోంది. `డు వాట్ యు లవ్` అన్న క్యాప్ష‌న్ తో ఈ ఫోటోని షేర్ చేయ‌గా అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇక ఇదే స్పీడ్ లో కొత్త సినిమాని ప్ర‌క‌టిస్తుందేమో చూడాలి.