Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బ్యూటీ అవార్డ్స్ లో శారీ బ్యూటీ

By:  Tupaki Desk   |   19 Feb 2020 6:45 AM GMT
ఫోటో స్టోరీ: బ్యూటీ అవార్డ్స్ లో శారీ బ్యూటీ
X
మలయాళ భామ మాళవిక మోహనన్ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలిసి ఉండే అవకాశం తక్కువే. మలయాళం.. తమిళం.. కన్నడ.. హిందీ భాషల్లో ఇప్పటికే నటించింది. . తెలుగులో విజయ్ దేవరకొండ 'హీరో' తో ఎంట్రీ ఇవ్వాలి కానీ ఆ సినిమా అసలు ఉందా లేదా అనేది ఎవరికీ తెలియదు. ఆ సినిమా ఉంటే మాత్రం అదే టాలీవుడ్ డెబ్యూ అవుతుంది. ఈ భామ న్యూ జెన్ బ్యూటీ. అందుకే హాట్ ఫోటో షూట్లతో సంచలనాలు సృష్టిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాను చెడుగుడు ఆడుకుంటూ ఉంటుంది.

నిన్న రాత్రి మాళవిక ఫెమినా ఇండియా బ్యూటీ అవార్డ్స్ ఈవెంట్ లో పాల్గొంది. అసలే బ్యూటీ అవార్డ్స్.. తను కూడా బ్యూటీ కాబట్టి కత్తిలాగా రెడీ అవ్వాలని అనుకుందట. అలా రెడీ అయిన తర్వాత ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి "మీకు అనుమానం ఉన్నప్పుడు చీర కట్టుకోండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చీర సంగతి చెప్పింది కాబట్టి ఈ సూచన మగవారికి కాదని మనం ఫిక్స్ అయిపోవాల్సిందే! ఇక ఫోటో విషయానికి వస్తే వీలైనంత గ్లామరసం ఒలికేలా పారదర్శకమైన చీరను వయ్యారం గా కట్టుకుంది. టుస్సాడ్స్ లోని మైనపు బొమ్మలా నిలుచుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్..ఆ హెయిర్ స్టైల్ అంతా మోహనమే.. మన్మోహనమే.

ఈ ఫోటోకు..నెటిజన్ల రసహృదయాలు కరిగిపోయి కామెంట్లుగా మారాయి. "దేశి గర్ల్.. సెక్సీ చీర".. "స్టన్నింగ్ కేరళ బ్యూటీ".. "సూపర్ హాట్" అంటూ వారి స్పందనలు తెలిపారు. ఇక మాళవిక సినిమాల విషయానికి వస్తే తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా 'మాస్టర్' లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది.