Begin typing your search above and press return to search.
విలక్షణ నటుడు కళాభవన్ మణి కన్నుమూత
By: Tupaki Desk | 6 March 2016 5:11 PM GMTవిక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన జెమిని సినిమా చూసిన వాళ్లెవ్వరూ అందులో విలన్ పాత్ర పోషించిన కళాభవన్ మణిని అంత సులువుగా మరిచిపోలేరు. ఈ విలక్షణ మలయాళీ నటుడు ఈ రోజు హఠాత్తుగా కన్నుమూశాడు. కోచిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మణి.. 7.15 నిమిషాలకు తుది శ్వాస విడిచాడు. ఆయనకు కాలేయం, మూత్రపిండాలు పాడైనట్లు తెలుస్తోంది. కొంత కాలంగా మణి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల కిందట పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారు.వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.
మణి ఒకప్పుడు సాధారణ ఆటోడ్రైవర్ కావడం విశేషం. మిమిక్రీ ఆర్టిస్టుగా.. గాయకుడిగా.. ప్రస్థానం ఆరంభించి తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన మణి.. వాసంతియుం లక్ష్మియుం పెన్నె నానుమ్ (తెలుగులో శీను వాసంతి లక్ష్మి) సినిమాలో చాలా మంచి పేరు సంపాదించాడు. ఆ సినిమాకు అతడికి జాతీయ స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా దక్కింది.ఆ తర్వాత తమిళంలో జెమిని సినిమాతో సౌత్ ఇండియా అంతా అతడి పేరు మార్మోగిపోయింది. జెమిని తెలుగు రీమేక్ లో సైతం అద్భుత నటనతో అలరించాడు. తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించాడు. కొన్నేళ్లుగా మాతృభాష మలయాళంలో మాత్రమే నటిస్తున్న మణి.. ఇలా అనారోగ్యంతో చనిపోవడం విచారకరం. ఆయన వయసు 45 ఏళ్లు మాత్రమే.