Begin typing your search above and press return to search.

బీఫ్ వివాదంలో మ‌ల‌యాళ‌ స్టార్ న‌టి!

By:  Tupaki Desk   |   9 Sep 2017 5:08 PM GMT
బీఫ్ వివాదంలో మ‌ల‌యాళ‌ స్టార్ న‌టి!
X
కొంత కాలంగా బీఫ్ పై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న సంగతి తెలిసిందే. నిత్యం బీఫ్ కు సంబంధించిన ఏదో ఒక వార్త‌ను మ‌నం వింటూనే వింటాం. తాజాగా, ఈ బీఫ్ వివాదంలో ఓ మ‌ల‌యాళ‌ స్టార్ న‌టి చిక్కుకుంది. మిన్న‌మిణుగు అనే మ‌ల‌యాళ చిత్రానికి ఉత్త‌మ జాతీయ న‌టి అవార్డు అందుకున్న సుర‌భి ల‌క్ష్మి పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆమె బీఫ్ తింటున్న వీడియో ఓనం రోజున ప్ర‌సారం అయింది. దాంతోపాటు ఆమె ఓనం రోజున‌ చికెన్ తింటూ దిగిన సెల్ఫీని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో నెటిజ‌న్లు ఆమెపై మండిప‌డుతున్నారు.

ఓ టీవీ చానెల్ వారు త‌న ఇంట‌ర్వ్యూ కోసం ప‌దే ప‌దే అడుగుతుండ‌డంతో ఆ హోట‌ల్ లో ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డానికి అంగీక‌రించాన‌ని సుర‌భి చెప్పింది. త‌న ఆహార‌పు అల‌వాట్ల గురించి చెప్ప‌డం కూడా ఆ ఇంట‌ర్వ్యూలో భాగ‌మ‌ని, ఓనం కంటే మూడు వారాల ముందు ఆ ఇంట‌ర్వ్యూ షూటింగ్ జ‌రిగింద‌ని క్లారిటీ ఇచ్చింది. కొజికోడ్‌లోని తన ఫెవరెట్‌ హోటల్ లో బీఫ్ తింటుండ‌గా ఆ ఇంట‌ర్వ్యూని చిత్రీక‌రించామ‌ని తెలిపింది. ‘ఆ కార్యక్రమం కోసం నేను అక్కడికి వెళ్లాను. బాగా ఆకలేసింది. ఆ సమయంలో నేను తింది బీఫా?చికెనా? పంది మాంసమా? అని ఆలోచించలేదు. మనిషికి ఆకలి ముఖ్యం. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. ఆ కార్యక్రమం ఓనం రోజు ప్రసారం కావటం అని సుర‌భి చెప్పింది. ఉత్త‌ర కేర‌ళ‌లో ఓనం సంద‌ర్భంగా మాంసాహారం తిన‌డం మామూలేన‌ని, కేర‌ళ‌లోని ద‌క్షిణ ప్రాంతంలో ఓనం రోజున పూర్తి శాకాహారం తింటార‌ని తెలిపింది. ఈ తేడాను గ‌మ‌నించ‌కుండా త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వాపోయింది.