Begin typing your search above and press return to search.

బ్రెస్ట్ అంటే పాలిచ్చేందుకే.. అలా చూడకండి

By:  Tupaki Desk   |   1 March 2018 8:30 AM GMT
బ్రెస్ట్ అంటే పాలిచ్చేందుకే.. అలా చూడకండి
X
మహిళలను సెక్సువల్ ఆబ్జెక్ట్స్ గా చూడడం కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వారి శరీర భాగాలను అందాలను ప్రదర్శించేందుకు అన్నట్లుగా చూపడం.. జనాలు ఆ యాంగిల్లోనే చూడడం జరుగుతోంది. కానీ ఒక్క ఫోటోతో.. అందులోని కాన్సెప్ట్ తో.. ఇండియాలోనే తొలిసారిగా ఓ సంచలన ప్రయత్నం చేసింది ఓ వనిత. మలయాళ మ్యాగజైన్ అయిన మాతృభూమి.. గృహలక్ష్మి అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది.

ఇందుకోసం ఓ మహిళ.. పసిబిడ్డకు పాలు ఇస్తున్న ఫోటోను ఓపెన్ గా ప్రచురించింది. ఇంత ఓపెన్ గా ఇలాంటి ఫోటో కనిపించడం.. ఇండియాలో ఇదే మొదటిది అని చెప్పవచ్చు. మహిళలను కేవలం సెక్సువల్ ఆబ్జెక్ట్స్ గా చూడద్దని.. బ్రెస్ట్ ఫీడింగ్ చేసేందుకే ఈ భాగాలు అంటూ కవర్ పేజ్ పై రాసిన మెసేజ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఇంత ధైర్యం చేసిన ఆ మహిళ ఎవరా అనే డౌట్ రావడం సహజమే. ఈమె ఎవరో కాదు.. మలయాళ రైటర్ కం పాటల రచయిత కం అడపాదడపా యాక్టింగ్ కూడా చేసే గిలు జోసెఫ్. ఈమె ఇంకా సింగిల్ కావడం మరీ విశేషం.

అయినా సరే బ్రెస్ట్ ఫీడింగ్ పై అవగాహన కల్పించేందుకు.. మహిళలు ఈ విషయంలో వెనుకంజ వేయకూడదని చాటి చెప్పేందుకు గిలు జోసెఫ్ ప్రయత్నించింది. ఆమె చేసిన ఈ బోల్డ్ ప్రయత్నానికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అయితే.. మెడలో మంగళసూత్రంతో ఖరీదైన యువతిగా కనిపించడం వంటి విమర్శలు చేస్తున్న కుహనా మేథావులు కూడా ఉన్నారు.