Begin typing your search above and press return to search.
మళయాళ సీమలో మరో వేధింపుల పర్వం
By: Tupaki Desk | 24 July 2017 7:10 AM GMTమూడు నెలల క్రితం మళయాళీ హీరోయిన్ భావన తనను కొందరు కిడ్నాప్ చేసి వేధించి అసభ్యంగా ఫొటోలు తీశారంటూ పోలీసులకు కంప్లయిట్ చేసింది. ఈ ఇన్సిడెంట్ ను ముందు మామూలు వేధింపుల కేసుగానే అందరూ అనుకున్నారు. చివరకు ఇది చేయించింది మళయాళం స్టార్ హీరో దిలీప్ పోలీసుల ఎంక్వయిరీలో తేలింది. పోలీసులు అతడి చుట్టూ ఉచ్చు బిగించి కటకటాల వెనక్కి పంపారు.
రీసెంట్ గా మరో మళయాళ నటి మైథిలి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కిరణ్ కుమార్ తనను అసభ్యంగా ఫొటోలు తీసి ఆన్ లైన్ లో పెట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ కుమార్ దాదాపు పదేళ్లగా నటి మైథిలికి తెలిసిన వ్యక్తే. తనకు పెళ్లి అయిందనే విషయం దాచిపెట్టి ఆమెకు దగ్గరవాలని ప్రయత్నించాడు. చివరకు ఈ విషయం తెలిసిన ఆమె అతడిని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. దీంతో కిరణ్ కుమార్ ఆమెను అసభ్యంగా తీసిన న్యూడ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. తాను కోరినంత డబ్బివ్వకపోతే ఈ ఫొటోలు నెట్ లో పెడతానంటూ బెదిరించాడు. ఆమె ఆ బెదిరింపులను లెక్క చేయకపోవడంతో ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడవి అక్కడ వైరల్ గా మారాయి. దీంతో నటి మైథిలి దీనిపై ఎర్నాకులం పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ నెట్ వర్క్ సైట్లలో పెట్టి అవి స్ప్రెడ్ అవడం వెనుక కొంతమంది ఉన్నారని.. వారినీ అరెస్ట్ చేస్తామని అక్కడి పోలీసులు ప్రకటించారు.
సాధారణంగా వేధింపుల పర్వం మొదలు పెట్టగానో మహిళలు భయపడిపోతుంటారు. అలా కాకుండా తమకు జరిగిన అన్యాయానికి ఎదురు తిరిగి పోరాడటం మంచి పరిణామమనే చెప్పాలి. ఈ దిశగా ముందు మళయాళ నటీమణులు ముందడుగు వేశారు.