Begin typing your search above and press return to search.

మాస్ మ‌హారాజా కోసం బ‌రిలో దిగిన హాట్ మ‌ల్లూ గాళ్

By:  Tupaki Desk   |   19 July 2021 6:04 AM GMT
మాస్ మ‌హారాజా కోసం బ‌రిలో దిగిన హాట్ మ‌ల్లూ గాళ్
X
మాస్ మహారాజా రవితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `రామరావు ఆన్ డ్యూటీ`. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడు. ఎస్‌.ఎల్‌.వి సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి - ఆర్‌.టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాత‌. మైనింగ్

రవితేజ కెరీర్ 68వ చిత్రమిది. ఈ చిత్రంలో చిత్తూరు జిల్లాకి చెందిన‌ ఓ ప్ర‌భుత్వ అధికారిగా ర‌వితేజ‌ క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రం టైటిల్ - ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ కాగా.. అద్భుత స్పందన ద‌క్కింది. మాఫియా లేదా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌ను ఆట క‌ట్టించే అధికారి క‌థాంశ‌మా? అంటూ ఫ‌స్ట్ లుక్ పై చ‌ర్చ సాగుతోంది. రామారావు ఆన్ డ్యూటీకి అరంగేట్ర దర్శకుడు ప‌ని చేస్తున్నా దీనికి సంబంధించిన ప్రతి ప్రకటన ఎగ్జ‌యిట్ మెంట్ ని పెంచుతోంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర దేనిక‌దే ప్ర‌త్యేకంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నార‌ని స‌మాచారం.

`రామారావు ఆన్ డ్యూటీ`లో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. జెర్సీ ఫేం దివ్యాన్ష కౌశిక్ ఒక క‌థానాయిక కాగా.. మలయాళ నటి రాజీషా విజయన్ మ‌రో నాయిక‌గా క‌నిపించ‌నుంది. ఈ చిత్రంతో రాజీషా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. మూవీలో త‌న‌ పాత్ర చాలా కీలకం. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో రాజీషా విజయన్ పాల్గొంటున్నారు. రవితేజ- దివ్యాన్ష కౌశిక్ కూడా ఈ షూట్ లో పాల్గొంటున్నారు.

ర‌వితేజ న‌టించిన క్రాక్ నిజ‌ఘ‌ట‌న‌ల‌తో రూపొందిన సినిమా. ఈ చిత్రం క్రైసిస్ లో రిలీజైనా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అదే తీరుగా నిజఘటనల నుండి ప్రేరణ పొందిన కథతో ఒక ప్రత్యేకమైన థ్రిల్లర్ గా రామారావు ఆన్ డ్యూటీ తెర‌కెక్కుతోంది. ఇందులో తారాగ‌ణం స‌హా సాంకేతిక నిపుణులు అనుభ‌వ‌జ్ఞులైన వారు ప‌ని చేస్తున్నారు.

నాజర్- శ్రీ నరేష్- పవిత్ర లోకేష్- రాహుల్ రామకృష్ణ- ఈరోజుల్లో శ్రీ- మధుసూధ‌న్ రావు- సురేఖా వాణి త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండ‌గా.. సత్యన్ సూర్యన్ ఐఎస్సి కెమెరా వ‌ర్క్ అందిస్తున్నారు. సాహి సురేష్ క‌ళాద‌ర్శ‌కుడు కాగా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటర్. శ‌ర‌త్ మండ‌వ ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు.