Begin typing your search above and press return to search.
ఇలా చేస్తే పైరసీ ఢమాల్
By: Tupaki Desk | 20 July 2015 10:36 AM GMTపైరసీని అరికట్టడానికి మేధావులంతా బోలెడన్ని చేస్తున్నారు. అయినా ఈ మహమ్మారీని ఇంతకాలం ఎవరూ ఆపలేకపోయారు. థియేటర్ లో రిలీజైన సినిమాలన్నీ ఎప్పటికప్పుడు అప్ డేట్ అయిపోతూనే ఉన్నాయి. టొరెంటులు వీటిని అందిస్తూనే ఉన్నాయి. అయితే ఈ గోల నుంచి సినిమాకి ఉపశమనం కలిగించే ఉపాయం చేశారు కొచ్చీకి చెందిన ఓ ముగ్గురు కుర్రాళ్లు.
బ్లెయిస్, వివేక్, గౌతమ్ ఆ ముగ్గురి పేర్లు. ఈ కుర్రాళ్లు దీనికోసం ఓ డిజిటల్ ప్లాట్ ఫాం తయారు చేశారు. రీల్ మాంక్ డాట్ కాం పేరుతో ఓ వెబ్ సైట్ ని డిజైన్ చేశారు. ఇందులోకి రిలీజ్ కోసం రెడీగా ఉన్న చిత్రాల్ని అప్‌లోడ్ చేస్తారు. దీన్ని డైరెక్టుగా సైట్ నుంచి అధికారికంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మామూలు ప్రింటు అయితే రూ.180 చెల్లించాలి. నాణ్యమైన ఒరిజినల్ ప్రింట్ కావాలంటే రూ.300చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒకసారి డౌన్ లోడ్ చేసుకున్న ఫైల్ కేవలం సిస్టమ్ లో మాత్రమే వీక్షించగలరు. పెన్ డ్రైవ్ లోకి కాపీ చేయలేం. ఇప్పటికే ఇలా మలయాళ చిత్రాల్ని నేరుగా ఈ వెబ్ సైట్ లో రిలీజ్ చేసేస్తున్నారు వీరు. ఒకవేళ వేరే భాషల నుంచి ఎవరైనా ముందుకి వచ్చినా అవకాశం ఇస్తారు.
కాని ఈ పద్ధతి చిన్న బడ్జెట్ సినిమాలకు మాత్రమే అనుకూలం. మలయాళం, బోజ్ పురి వంటి పరిశ్రమలకు సెట్టవుతుంది. తెలుగులో కూడా యేటేటా రిలీజ్‌కి రాకుండా ల్యాబుల్లో మగ్గే సినిమాలెన్నో, అలాంటివాటిని రిలీజ్ చేసుకోవడానికి ఈ ప్లాట్ ఫాం బాగానే ఉంటుందేమో. చిన్న సినిమాల కోసం థియేటర్ల వరకూ వెళ్లి క్యూలో నించుని టిక్కెట్లు కొనుక్కుని కుటుంబ సమేతంగా చూసే సీన్ లేదు.. కాబట్టి ఇలా డౌన్ లోడింగ్ కి అవకాశం ఇస్తే మంచిదే.