Begin typing your search above and press return to search.
24 గంటల తర్వాత ఐసీయులోనే యువ నటుడు
By: Tupaki Desk | 8 Oct 2020 5:00 PM GMTమలయాళ యువనటుడు టోవినో థామస్ తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కడుపులో గాయం ఇంటర్నల్ బ్లీడింగ్ సమస్యకు చికిత్స పొందుతున్నారాయన. వైద్యానికి స్పందిస్తూ ఆరోగ్యం స్థిరంగానే ఉందని సమాచారం. అతని పరిస్థితి సంతృప్తికరంగా ఉందని రెనాయ్ మెడిసిటీ ఆస్పత్రి వర్గాలు గురువారం వెల్లడించాయి.
కడుపు ప్రాంతంలో తీవ్రమైన నొప్పి ఉందని ఫిర్యాదు చేయడంతో టోవినోను కొచ్చిలోని పలరివట్టం వద్ద రెనాయ్ మెడిసిటీకి తరలించారు. ప్రాథమిక పరీక్షల తరువాత అతన్ని ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ విభాగంలో చేర్చారు. అతన్ని 24 గంటలు పరిశీలనలో ఉంచిన తరువాత ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. అతను చికిత్సతో మెరుగుపడుతున్నాడని వైద్యులు తెలిపారు.
నటుడు టోవినో థామస్ ను 07.10.2020 ఉదయం 11.15 గంటలకు మా యాక్సిడెంట్ & ఎమర్జెన్సీ విభాగానికి తీవ్రమైన కడుపు నొప్పితో తీసుకువచ్చారు. అతనికి వెంటనే CT యాంజియోగ్రామ్ చేశాం. ఇది మెసెంటెరిక్ హెమటోమా (రక్త చుక్కలు) ను వెల్లడించింది. రక్తస్రావం అదుపు తప్పనందున అతన్ని 48 గంటల పరిశీలన కోసం ఐసియుకు తరలించారు. అతని రక్త గణన ఇంప్రూవ్ అయ్యింది. తగిన యాంటీబయాటిక్స్ తో చికిత్స పొందుతున్నారు ” అని ఆసుపత్రి నుండి ప్రకటన వెలువడింది. అతను మరో 48 గంటలు పరిశీలనలో ఉంటాడు. ``అతని స్థితిలో ఏదైనా క్షీణించినట్లయితే, అతన్ని వెంటనే లాపరోస్కోపిక్ ప్రక్రియ మొదలవుతుంది. ప్రస్తుతం అతని పరిస్థితి సంతృప్తికరంగా ఉంది (sic)” అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
తన తదుపరి చిత్రం `కాలా` కోసం స్టంట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు టోవినో థామస్ కడుపులో కిక్ పంచ్ పడిందది. దాని తరువాత అంతర్గత గాయంతో బాధపడ్డాడు. అయినా అతను నొప్పిని పట్టించుకోకుండా ఈ చిత్రం షూటింగ్ కొనసాగించాడు. బుధవారం అతని నొప్పి తీవ్రం కావడంతో వైద్య సహాయం కోరారు.