Begin typing your search above and press return to search.
వార్తల్లో నిలుస్తోన్న మలయాళ మూవీ!
By: Tupaki Desk | 4 Feb 2023 5:00 PM GMTగత కొంత కాలంగా ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే మలయాళ ఇండస్ట్రీలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ కి పెద్ద పీట వేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ముందు కథ.. ఆ తరువాతే కథానాయకుడి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ విషయం చాలా ఏళ్లుగా ఇతర ఇండస్ట్రీల వాళ్లకి తెలిసినా భారీ స్థాయిలో మాత్రం కరోనా సమయంలోనే మలయాళ ఇండస్ట్రీ అంటే ఏంటో మలయాళేతర ప్రేక్షకులకు తెలిసింఇది. కరోనా కాలంలో మలయాళం నుంచి తెలుగులో అనువాదం అయిన సినిమాలు అన్నీ ఇన్నీ కావు.
థియేటర్లలో రీమేక్ లుగా రాగా, ఓటీటీల్లో అనువాదాలుగా విడుదలై మంచి ఆదరణ పొందాయి. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూనే పలు కొత్త విషయాలని తెలియజేశాయి. మాలిక్, టివినో థామస్ 'ఫోరెన్సిక్', మిన్నాల్ మురళి', మిడ్ నైట్ మర్డర్స్, అయ్యప్పనుమ్ కోషియుమ్, నాయట్టు, సీయూ సూన్ వంటి పలు సినిమాలు ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి. ఇందులో అయ్యప్పనుమ్ కోషియుమ్ ని తెలుగులో 'భీమ్లానాయక్' పేరుతో రీమేక్ చేయడం తెలిసిందే.
ప్రస్తుతం మలయాళంలో విజయవంతమైన 'కప్పెల' మూవీని తెలుగులో 'బుట్టబొమ్మ' పేరుతో రీమేక్ చేశారు. ఇది ఫిబ్రవరి 4న థియేటర్లలోకి వచ్చేసింది. ఇదిలా వుంటే ఇప్పుడు మరో మలయాళ మూవీ టాలీవుడ్ లో రీసౌండ్ ఇస్తోంది. జిజు జార్జ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఇరట్ట'. ఇందులో జిజు జార్జ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ డ్రామా. అంజలి, శ్రీంద, శ్రీకాంత్ మురళి, శరత్ సభ, శ్రీజ తదితరులు నటించారు.
ఈ మూవీ ద్వారా రోహిత్ ఎం.జి. కృష్ణన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. విభిన్నమైన నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. రివ్యూస్ కూడా పాజిటివ్ గా రావడం గమనార్హం. క్లైమాక్స్ సన్నివేశాలు తెలిసినట్టే అనిపిస్తున్నా చివరి నిమిషంలో వచ్చే ట్విస్ట్ లు, టర్న్‌లు సినిమాకి కీలకంగా నిలిచి సగటు ప్రేక్షకుల్ని థ్రిల్ కు గురి చేస్తున్నాయి. తనదైన పంథాలో దర్శకుడు ప్రేక్షకుడి ఆలోచనకు పూర్తి భిన్నంగా క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ ప్రతీ ఒక్కరినీ కట్టిపడేస్తోంది.
ఫారెస్ట్ మినిస్టర్ ప్రారంభించే ఓ కార్యక్రమంలో వినోద్ అనే పోలీస్ మరణిస్తాడు. అదే చోటుకి ప్రమోద్ అనే వ్యక్తి వస్తాడు. అతనిపై పోలీసులు కేసు పెడతారు. ఈ కేసు నుంచి ప్రమోద్ ఎలా బయటపడ్డాడు. ఇంతకీ వినోద్ ని హత్య చేసింది ఎవరు?..దీని వెనకున్న అసలు కథేంటీ? అన్నదే ఈ చిత్ర ప్రధాన కత. మలయాళంలో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ మూవీని త్వరలో తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.