Begin typing your search above and press return to search.
అల్లు కాంపౌండ్ లో సక్సెస్ ఫుల్ మలయాళ రీమేక్..?
By: Tupaki Desk | 4 Aug 2021 12:30 AM GMTమలయాళంలో విజయవంతమైన కథాబలం ఉన్న చిత్రాలను తెలుగులో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా రీమేక్ చేస్తున్న 'అయ్యప్పనుమ్ కొశీయుమ్'.. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు రీమేక్ చేస్తున్న మరో చిత్రం 'కప్పెల'.. చిరంజీవి తలపెట్టిన 'లూసిఫర్' రీమేక్.. రామ్ చరణ్ రైట్స్ తీసుకున్న 'డ్రైవింగ్ లైసెన్స్'.. ఇవన్నీ కూడా మలయాళ సినిమాలే. ఈ క్రమంలో ఇప్పుడు 'నాయాట్టు' అనే మరో మలయాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
2021లో విడుదలైన సక్సెస్ ఫుల్ చిత్రాల్లో 'నాయాట్టు' ఒకటి. కుంచాకో బోబన్ - జోజు జార్జ్ మరియు నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మార్టిన్ ప్రకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షాహి కబీర్ కథ అందించారు. రాజకీయ నాయకులు తమ స్వార్ధం కోసం వ్యవస్థలను ఎలా ఉపయోగించుకుంటారు.. అధికారం చేతిలో ఉంటే నాయకులు ఎవరినైనా ఎలా వేధింపులకు గురి చేస్తారు.. ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ సొంత పోలీసులను ఎలా బలిపశువులను చేస్తుంది.. అనే అంశాలను ఈ చిత్రంలో చూపించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
'నాయాట్టు' తెలుగు రీమేక్ హక్కులను అల్లు అరవింద్ సారధ్యంలోని గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ వారు దక్కించుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ రీమేక్ కోసం కొంతమంది దర్శకులతో చర్చలు జరుపుతున్నారని.. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని అంటున్నారు. అయితే ఈ సినిమా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా.. పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది కానీ, హీరోయిజం వంటి అంశాలకు చోటే ఉండదు. అల్లు అర్జున్ - అల్లు శిరీష్ లకు సెట్ అయ్యే మూవీ కాదు. రీమేక్ రైట్స్ తీసుకుంది నిజమే అయితే తెలుగులో ఎవరితో చేస్తారో చూడాలి.
ఇకపోతే 'నాయాట్టు' హిందీ రీమేక్ హక్కులను బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. అలానే తమిళ రీమేక్ రైట్స్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ వద్ద ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే ఈ మలయాళ రీమేక్ గురించి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.