Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ కి విల‌న్ గా మ‌ల‌యాళం స్టార్!

By:  Tupaki Desk   |   26 Oct 2021 11:38 AM GMT
చ‌ర‌ణ్ కి విల‌న్ గా మ‌ల‌యాళం స్టార్!
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థాన‌య‌కుడిగా దేశం గ‌ర్వించ ద‌గ్గ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ 15వ చిత్రంగా రిలీజ్ కాబోతుంది. ఇందులో కియారా అద్వాణీ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇటీవ‌లే గ్రాండ్ గా సినిమా ప్రారంభోత్స‌వం జ‌రిగింది. అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ల‌బోతుంది. ఇందులో చ‌ర‌ణ్ ప‌వ‌ర్ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌ను న్నారు. ఓ ఐఏఎస్ అధికారి రాజ‌కీయ నాయ‌కుడిగా మారితే రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో వ‌చ్చిన మార్పులు స‌మూహ‌మే క‌థాంశంమ‌ని ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. ఈ విష‌యం బ‌య‌ట‌కు రాగానే `భార‌తీయుడు` రేంజ్ లో సినిమా ఉండ‌బోతుంద‌ని అంచ‌నాలు ఆకాశాన్నంటున్న‌తున్నాయి.

ఇలాంటి బ‌ల‌మైన కంటెంట్ తో తెర‌కెక్కుతుందంటే చ‌ర‌ణ్ తో పాటు మిగ‌తా పాత్ర‌లు అంతే హైలైట్ అవ్వాలి. స‌హ‌జంగా శంక‌ర్ సినిమాలో విలన్ పాత్ర‌లు చాలా బ‌లంగా క‌నిపిస్తాయి. తాజాగా దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒక‌టి అందింది. ఇందులో ప్ర‌ధాన విల‌న్ గా మ‌ల‌యాళం స్టార్ సురేష్ గోపీని దించాల‌ని ఆలోచ‌న చేస్తున్నారుట‌. స్ర్కిప్ట్ .. పాత్ర గురించి డిస్క‌ష‌న్ కూడా పూర్త‌యింద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే తుది నిర్ణ‌యం బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఇంకా ఐ చిత్రంలో న‌టించిన దిగ్గ‌జ విల‌న్ల‌ని సైతం రంగంలోకి దింత‌పుతున్నారని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈషా గుప్పా ఓ నెగిటివ్ రోల్ లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఏది ఎలా ఉన్నా శంక‌ర్ సినిమా అంటే భారీ కాన్సాస్ పై తెర‌కెక్కాల్సిందే. నిర్మాణంలో ఎక్క‌డా రాజీ ఉండ‌దు. సినిమాలో రిచ్ నెస్ ని క‌చ్చితంగా చూపించాలి. ప‌క్కాగా తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లు ప్ర‌జెంట్ చేయ‌డ‌మే స్టార్ మేక‌ర్ కి తెలిసింద‌ల్లా.

శంక‌ర్ మార్క్ చిత్రంగా నిలుస్తుంద‌ని తెలుస్తోంది. ఇందులో శ్రీకాంత్..సునీల్ ..అంజ‌లి కాల‌క పాత్రలు పోషిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.