Begin typing your search above and press return to search.

85 రోజులు.. 4 రిజక్షన్లు.. చివరకు బెయిల్

By:  Tupaki Desk   |   3 Oct 2017 10:00 AM GMT
85 రోజులు.. 4 రిజక్షన్లు.. చివరకు బెయిల్
X
మలయాళ స్టార్ హీరో దిలీప్ కు ఊహించని షాకులు ఎన్నో తగిలేశాయి. ఒక పాపులర్ హీరోయిన్ పై ఒక రోడ్డు సైడ్ రౌడీతో ఎటాక్ చేయించి.. ఆమెను మానభంగం చేయించి.. ఈ వీడియోలను చిత్రీకరించేలా చేశాడనే అభియోగంతో అరెస్టయ్యాడు. గత 85 రోజులుగా జైల్లోనే ఉంటున్నాడు. ఎన్నిసార్లు బెయిల్ కోసం అభ్యర్ధించినా కూడా.. డిఫెన్స్ వారి వాదనలు గట్టిగా ఉండడంతో మనోడికి బెయిల్ కూడా రాలేదు. అయితే ఎట్టకేలకు కాస్త రిలీఫ్‌ దక్కిందిలే.

ఇప్పటికే నాలుగు సార్లు బెయిల్ పిటీషన్ రద్దయినా కూడా.. 5వ సారి కూడా బెయిల్ కోసం ఎప్లయ్ చేశాడు దిలీప్. ఈసారి ఇతడి లాయర్ల వాదనలను విన్న కేరళ హైకోర్టు ఎట్టకేలకు ఇతగాడికి బెయిల్ మంజూరి చేసింది. ఫిబ్రవరి నెలలో ఒక నటీమణిపై ఎటాక్ చేయించాడనే అభియోగంతో జూలై 10న ఈ స్టార్ అరెస్ట్ అయ్యాడు. కేసులో 11వ ముద్దాయిగా అభియోగాలు ఎదుర్కొంటున్న దిలీప్.. చివరకు 1 లక్ష రూపాయలు చెల్లించి షరతులతో కూడిన బెయిల్ పొందాడు. అలాగే అతగాడి పాస్ పోర్టును కూడా సరెండర్ చేయాలని.. సాక్షులను సాక్ష్యాలను ఎటువంటి విధంగానే ప్రభావితం చేయకూడదని ఆదేశిస్తూ.. కోర్టు బెయిల్ ఇచ్చింది.

ఇక కేసు విషయానికొస్తే.. పల్సర్ సునీ అనే రౌడీతో దిలీప్ ఈ నేరానికి ఒడిగట్టాడనేది పోలీసుల వాదన. దిలీప్ ఇదంతా ఖండించినప్పటికీ.. పోలీసులు మాత్రం దిలీప్ అండ్ సునీ మధ్యలో జరిగిన సంభాషణలు.. ఇద్దరి మధ్యనా బ్యాంకు నుండి లావాదేవీలను జరిపిన తీరును.. అలాగే సదరు హీరోయిన్ ను నగ్నంగా తీసిన వీడియోలను కూడా సంపాదించి ఉచ్చు బిగించారనే టాక్ వినిపిస్తోంది.