Begin typing your search above and press return to search.
వైఎస్ ఆర్ రూపంలో ఆయన వస్తున్నాడా?
By: Tupaki Desk | 1 Jan 2018 1:58 PM GMTతెలుగు రాష్ట్రాల ప్రజలలో కలకాలం గుర్తిండిపోయే రాజకీయ నేతలలో వైఎస్ ఆర్ పేరు ప్రముఖంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన అకాల మరణం చెందిన తర్వాత.. అనేక పరిస్థితులు మారిపోయాయి. అయితే.. మహానేతగా గుర్తింపు పొందిన వైఎస్ ఆర్ జీవితంపై సినిమా రూపొందించేందుకు గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా.. రాజకీయ పరిస్థితుల కారణంగా సాధ్యపడలేదు.
కానీ ఇప్పుడు టాలీవుడ్ లో బయోపిక్స్ ట్రెండ్ బాగానే నడుస్తోంది. ఎన్టీఆర్ జీవితంపై పలువురు మేకర్స్ ఇప్పటికే సినిమాలను అనౌన్స్ చేయగా.. మరోవైపు సావిత్రి.. పుల్లెల గోపీచంద్ లపై కూడా సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు వైఎస్ ఆర్ జీవితాన్ని కూడా మూవీగా మలిచే ప్రాజెక్టు సాకారం కానుందని తెలుస్తోంది. రీసెంట్ గా ఆనందో బ్రహ్మ చిత్రంతో సక్సెస్ సాధించిన దర్శకుడు మహి రాఘవ.. వైఎస్ ఆర్ చిత్రానికి స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుని.. ప్రస్తుతం నటీనటుల వేటలో ఉన్నట్లు తెలుస్తోంది.
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టితో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రను చేయించాలని చూస్తున్నాడట దర్శకుడు. ఇప్పటికే ప్రపోజల్ ను పంపారని.. మమ్ముట్టి నుంచి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారని టాక్. మరోవైపు ఈ చిత్రాన్ని తెరకెక్కించే అంశంపై అనుమతుల కోసం వైఎస్ ఆర్ తనయుడు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కూడా కలిసేందుకు మహి రాఘవ ప్రయత్నిస్తున్నాడట. ఈ ప్రాజెక్టు ప్రారంభం అయితే మాత్రం.. ఆరంభంలోనే క్రేజ్ అమాంతం వచ్చేయడం ఖాయం.