Begin typing your search above and press return to search.

రిఫరెన్స్ లేకపోతే గాని టాలీవుడ్ లో హిట్లు కొట్టలేరా..?

By:  Tupaki Desk   |   8 April 2020 12:10 AM GMT
రిఫరెన్స్ లేకపోతే గాని టాలీవుడ్ లో హిట్లు కొట్టలేరా..?
X
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ సినిమాల హవా జోరందుకుంటుంది. మాములుగా తెలుగు సినిమాలు వేరే భాషల్లోకి అనువాదం అవుతూ ఉంటాయి. కానీ ఈ మధ్య వేరే భాషల్లోని సినిమాలు తెలుగులోకి ఎక్కువగా డబ్ అవుతున్నాయి. ఇక్కడ సూపర్ హిట్ కూడా అవుతున్నాయి. ఇంతవరకు తమిళం నుండి తెలుగులోకి డబ్ అయిన సినిమాలు చూసాం. కానీ ఈ మధ్య మలయాళం నుండి తెలుగులోకి రీమేక్ చేయడానికి తెలుగు బడా బడా దర్శక నిర్మాతలు తహతహలాడుతున్నారు. ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాలను లైన్ లో పెట్టారు కొందరు బడా నిర్మాతలు.

తెలుగులో ప్రస్తుతం టాప్ నిర్మాణ సంస్థలుగా కొనసాగుతున్న రెండు సంస్థలు మలయాళం మేకింగ్ చూసి ఆహా అనుకోని హక్కులను కూడా కొనిపెట్టేసుకున్నారు. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మనవాళ్ళ కన్ను మలయాళం సినిమాల మీద పడిందంటే అక్కడి వాళ్ళ నిర్మాణ విలువలు - మేకింగ్ ఎంత బాగుందో అర్ధమవుతుంది. రెండు పెద్ద బ్యానర్లు ఇప్పటికే హక్కులు సొంతం చేసుకొని నటీనటుల ఎంపిక కూడా మొదలు పెట్టాయి. తక్కువ బడ్జెట్ లో చిన్న చిన్న సినిమాలు రూపొందించి భారీ ఇండస్ట్రీ హిట్లను అందుకుంటున్నారు మలయాళీలు. చిన్న సినిమాలు తీసి విజయాలను అందుకోవడంలో మాత్రం మల్లువుడ్ ముందంజలో ఉంది. ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా మలయాళీల మేకింగ్ ఫార్మాట్ ఫాలో అయితే టాలీవుడ్ సేఫ్ జోన్ లో ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.